ఇది దగాకోరు ప్రభుత్వం

YS Jagan Mohan Reddy Fires on AP Government   - Sakshi

బాబు మాయ మాటలతో మోసం చేస్తున్నారు

దువ్వూరు బహిరంగ సభలో ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 

ప్రొద్దుటూరు నుంచి దువ్వూరు వరకు సాగిన ప్రజాసంకల్ప పాదయాత్ర

సమస్యల పరిష్కారం కోసం వెల్లువెత్తిన వినతులు

సాక్షి కడప : ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఆరో రోజైన ఆదివారం పాదయాత్ర ప్రొద్దుటూరు, దువ్వూరు మండలాల్లో సాగింది. దువ్వూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కరువు రైతును ఆదుకోవడంలో కూడా నిర్లక్ష్యం సాగుతోందని, ఇప్పటి వరకు కరువు మండలాల ప్రకటన చేయకపోవడం దారుణమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  కేసీ కెనాల్‌ స్థిరీకరణ జరగాలంటే కచ్చితంగా రాజోలి ప్రాజెక్టును నిర్మించి తీరాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రొద్దుటూరులోని అమృతానగర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడిన ప్రతిపక్ష నేత అమృతానగర్‌లో  నాన్న హయాంలో వేలాది ఇళ్లు నిర్మిస్తే నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదని ధ్వజమె త్తారు. ఏడాది కాలం ఆగండి... అధికారంలోకి రాగానే అమృతానగర్‌ రూపురేఖలు మారుస్తామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం చేనేత కార్మికుల సమస్యలపై ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వం వారి పట్ల చూపుతున్న సవతి ప్రేమను ఎండగట్టారు. 

ఎంత కష్టాన్ని భరిస్తున్నావు బిడ్డా...
దువ్వూరు మండలం నేలటూరు మెట్ట వద్ద చాపాడు మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన పలువురు మహిళలు వచ్చి ప్రతి పక్ష నేతను కలిశారు. లక్షుమ్మ అనే మహిళ వైఎస్‌ జగన్‌ను చూసి ఎంత కష్టాన్ని భరిస్తున్నావు బిడ్డా... మా కష్టాలను పంచుకునేందు కు నువ్వు ఇబ్బందులు పడుతున్నావు... మా రాజశేఖరరెడ్డి కొడుకును చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని కన్నీరు పెట్టుకుంది.   

అన్ని వర్గాల నుంచి వినతులు
ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డులో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు వారి సమస్యలను వైఎస్‌ జగన్‌తో ఏకరువు పెట్టారు.  కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకొచ్చారు. సగర (ఉప్పర) సామాజిక వర్గానికి చెందిన వారు, బేడ బుడగజంగాల సామాజిక వర్గ ప్రజలు కలిసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్న వైనాన్ని వైఎస్‌ జగన్‌కు వివరించారు. సీపీఎస్‌ యూనియన్, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు కూడా వినతి పత్రాలు ఇచ్చారు.  

More news

24-11-2017
Nov 24, 2017, 08:42 IST
‘చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మళ్లీ ఇపుడు నాలుగేళ్లుగా ఆయనే సీఎం కుర్చీలో...
24-11-2017
Nov 24, 2017, 06:32 IST
ఆత్మకూరు: ‘నాయనా.. నా పేరు ఎల్లమ్మ.. 80 ఏళ్లు నాకు. ఏమి గవర్నమెంటోళ్లు నాయనా.. వేలిముద్ర పడడం లేదని నాకొచ్చే...
24-11-2017
Nov 24, 2017, 06:30 IST
కోవెలకుంట్ల: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకుని..తరువాత ఏవీ చేయకుండా మమ్మల్ని మోసం చేశాడు’...
24-11-2017
Nov 24, 2017, 06:27 IST
కృష్ణగిరి: ‘నాకు పింఛన్‌ కావాలని మూడేళ్లుగా మా అమ్మతో కలిసి తిరగని ఆఫీసు లేదు. కలవని అధికారి లేడు. చివరికి...
24-11-2017
Nov 24, 2017, 06:25 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గొర్రెల కాపరులు అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజా సంకల్పయాత్రగా తమ గ్రామానికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు రత్నపల్లిలో రామచంద్రుడు...
24-11-2017
Nov 24, 2017, 06:22 IST
వెల్దుర్తి: స్కాలర్‌ షిప్‌లు రాక పిల్లలను చదివించుకోవడం కష్టమైందని రామళ్లకోటకు చెందిన పలువురు మహిళలు వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన...
24-11-2017
Nov 24, 2017, 06:19 IST
కోవెలకుంట్ల/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు వెల్దుర్తి మండలానికి చెందిన సీపీఎస్‌...
24-11-2017
Nov 24, 2017, 06:14 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కంగాటి...
24-11-2017
Nov 24, 2017, 06:10 IST
సాక్షి ప్రతినిధి, కర్నూలు:   ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని   ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని  ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌...
24-11-2017
Nov 24, 2017, 06:05 IST
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం : ‘అన్నా.. నేను బీపీఈడీ చదివా. అయినా ఉద్యోగం రాలేదు. బతుకుదెరువు కోసం...
24-11-2017
Nov 24, 2017, 06:01 IST
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం :  ‘అన్నా.. నా పేరు లక్ష్మీదేవి. బ్యాంకులో బంగారాన్ని కుదువపెట్టి రూ.50 వేలు...
24-11-2017
Nov 24, 2017, 05:57 IST
ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి/సాక్షి, అమరావతి బ్యూరో:  అన్నదాతలెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కుటుంబాల్లో కన్నీళ్లు నింపొద్దని ప్రతిపక్ష...
23-11-2017
Nov 23, 2017, 19:50 IST
సాక్షి, వెల్దుర్తి : నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌...
23-11-2017
Nov 23, 2017, 17:56 IST
సాక్షి, వెల్దుర్తి : ‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏం చేశాడంటే.. మధ్యనిషేదం గోవిందా. ఉద్యోగాలకు ఉన్న భరోసా గోవిందా. ప్రభుత్వ...
23-11-2017
Nov 23, 2017, 12:27 IST
సాక్షి, క‌ర్నూలు : తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు గురువారం వైఎస్‌ఆర్‌...
23-11-2017
Nov 23, 2017, 11:53 IST
సాక్షి, కర్నూలు : తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ అక్షయ గోల్డ్‌ బాధితులు గురువారం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌...
23-11-2017
Nov 23, 2017, 08:55 IST
సాక్షి, కర్నూలు : అభిమాన సంద్రం మధ్య ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. గురువారం...
23-11-2017
Nov 23, 2017, 07:17 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘అయ్యా 70 ఏళ్ల వయసు ఉన్నా మాకు పింఛన్‌ రావడం లేదు’ అని పెండేకల్‌కు చెందిన వృద్ధులు...
23-11-2017
Nov 23, 2017, 07:14 IST
ఆత్మకూరు: ‘సార్‌ నాపేరు వెంకటలక్ష్మమ్మ. మాది ముద్దవరం. ఈ పాప నా మనవరాలు నిహారిక. ఈ పాపకు కాళ్లు సచ్చుబడ్డాయి....
23-11-2017
Nov 23, 2017, 07:09 IST
పత్తికొండ రూరల్‌: తమను వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 108 కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు వైఎస్‌ జగన్‌కు...
Back to Top