సైఫాబాద్లో దొంగ అరెస్ట్: ల్యాప్ టాప్లు స్వాధీనం | Thief arrested in sifabad police | Sakshi
Sakshi News home page

సైఫాబాద్లో దొంగ అరెస్ట్: ల్యాప్ టాప్లు స్వాధీనం

Nov 16 2013 7:10 PM | Updated on Sep 2 2017 12:40 AM

నగరంలోని లక్డీకాపూల్లో ప్రయాణికుల నుంచి వస్తువుల్ని దొంగిలిస్తున్న రవితేజ అనే వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

నగరంలోని లక్డీకాపూల్లో ప్రయాణికుల నుంచి వస్తువుల్ని దొంగిలిస్తున్న రవితేజ అనే వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 ల్యాప్ టాప్లతోపాటు 50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని సైఫాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేశారు. లక్డీకపూల్లోని ట్రావెల్స్ వద్ద ప్రయాణికుల నుంచి వస్తువులు దొంగిలించే క్రమంలో రవితేజను ప్రయాణికులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement