నవంబరు13న పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు : బలరాంనాయక్‌ | Telangana Bill to be declared on November 13, says Balaram Nayak | Sakshi
Sakshi News home page

నవంబరు13న పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు : బలరాంనాయక్‌

Sep 30 2013 3:58 AM | Updated on Sep 1 2017 11:10 PM

తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లు నవంబర్‌ 13న పార్లమెంట్‌కు వస్తుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్‌ తెలిపారు.

దుగ్గొండి, న్యూస్‌లైన్‌ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లు నవంబర్‌ 13న పార్లమెంట్‌కు వస్తుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ఆదివారం ‘ఇంటింటికీ కాంగ్రెస్‌ జెండా-సోనియా అండ’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రకటన చేశాం. కేబినేట్‌ నోట్‌ రెడీ అయింది. ఇక రాష్ట్ర ఏర్పాటే తరువాయి అని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగిన సుదీర్ఘ నిర్విరామ పోరాటాలకు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తగిన ప్రతిఫలాన్ని ఇచ్చారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement