ఎస్కేయూ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాల బంద్ | Student committees to call bandh protest of SKU | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాల బంద్

Nov 3 2014 12:35 PM | Updated on Nov 9 2018 4:20 PM

జిల్లాలో శ్రీకృష్ణా దేవరాయ యూనివర్శటీ అధికారులు అత్యుత్సాహం చూపించారు. సోమవారం నుంచి జరగాల్సిన దూరవిద్య పరీక్షలను జన్మభూమి కారణంగా వాయిదా వేశారు.

అనంతపురం: జిల్లాలో శ్రీకృష్ణా దేవరాయ యూనివర్శిటీ అధికారులు అత్యుత్సాహం చూపించారు. సోమవారం నుంచి జరగాల్సిన దూరవిద్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఎస్కేయూ ప్రకటించింది. జన్మభూమి కార్యక్రమం కారణంగా పరీక్షలను తాము వాయిదా వేస్తున్నట్టు ఎస్కేయూ ఓ ప్రకటనలో పేర్కొంది.

పరీక్షలు వాయిదా వేయడాన్నినిరసిస్తూ ఎస్కేయూ విద్యార్థి సంఘాలు బంద్ చేపట్టాయి.  యూనివర్సిటీ అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. అధికారులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ ఎస్కేయూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement