శోభా నాగిరెడ్డి కన్నుమూత | Sakshi
Sakshi News home page

శోభా నాగిరెడ్డి కన్నుమూత

Published Thu, Apr 24 2014 12:18 PM

శోభా నాగిరెడ్డి కన్నుమూత - Sakshi


రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ అగ్రనేత శోభా నాగిరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటలకు ఆమె మరణించారు. ఈ విషయాన్ని కేర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరయ్యారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత. ఆమె 1968 నవంబర్‌ 16న ఆళ్లగడ్డలో జన్మించారు. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె అయిన శోభ ఇంటర్ వరకు చదివారు. 1986లో ఆమెకు భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది.

1996 నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే. అది కూడా చిరంజీవి ప్రభావం వల్ల కాకుండా, తమ కుటుంబానికి ఉన్న పరపతితోనే ఆమె గెలిచారు.

Advertisement
Advertisement