సంకురాత్రి చేసుకున్నట్టుంది! | Sankuratri to have! | Sakshi
Sakshi News home page

సంకురాత్రి చేసుకున్నట్టుంది!

Jan 15 2015 1:27 AM | Updated on Oct 1 2018 2:00 PM

సంకురాత్రి చేసుకున్నట్టుంది! - Sakshi

సంకురాత్రి చేసుకున్నట్టుంది!

‘రేయ్...తొందరగరా..ఎద్దులకు పై కడగదాం. పండుగ పూట కూడా ఇంటిపట్టున ఉండేట్టుల్లేవే’ అంటూ.. సుబ్బారెడ్డీ తన కొడుకు లింగారెడ్డీని పిలుస్తూ కేకలు వేస్తున్నాడు.

‘పేదవాడు కడుపునిండా తిన్నప్పుడే పండుగ’ అన్నాడో సినీ కవి. కానీ ఇంటిల్లిపాది కష్టపడినా ... రేయింబవళ్లు శ్రమించినా ముప్పూటలా మూడు వేళ్లు పోలేని పరిస్థితి నిరుపేదది. అలాగే ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతన్నదీ అదే దుస్థితి. పోనీ ఉద్యోగులైనా సంబరంగా చేసుకుంటున్నారంటే అదీ లేదు.  పొట్టచేతబట్టుకుని దూరాబారం ఉద్యోగం చేసుకునేవారు పండక్కు ఊరికి రావాలన్నా చార్జీ ధరలు చూసి భయపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదిగో ఓ గ్రామంలో ఇద్దరు రైతులు ఇలా సంభాషించుకుంటున్నారు.
 
సాక్ష ప్రతినిధి కడప: ‘రేయ్...తొందరగరా..ఎద్దులకు పై కడగదాం. పండుగ పూట కూడా ఇంటిపట్టున ఉండేట్టుల్లేవే’ అంటూ.. సుబ్బారెడ్డీ తన కొడుకు లింగారెడ్డీని పిలుస్తూ కేకలు వేస్తున్నాడు. అటుగా వెళ్లున్న చిన్ననాటి మిత్రుడు ఎల్లయ్య  సుబ్బారెడ్డితో గొంతు కలిపారు. ఆ ఇద్దరి ముచ్చట్లే సంక్రాంతి పండుగ కబర్లు.
 ఎల్లయ్య: ‘ఏం సుబ్బాడ్డీ బోగి పండుగ భలే చేసినావే. ఈసారి పండుగంతా నీదేబ్బా. ఊషారుగా ఉన్నావ్, మమ్మల్ని కూడ రోంత చూసుకోరాదు. ఈసారి పండుగ అనుకున్నట్లు చేయలేకపోతున్నాం.’ అన్నాడు ఎల్లయ్య.
 సుబ్బాడ్డీ:  ‘నీకేం కష్టమబ్బా ఎల్లయ్యా... మోతుబరి రైతువు. సన్న, చిన్నకారు రైతు లం మాబోటిగాళ్లు పండుగ చేసుకునేటట్లు ఉందా. కరువుతో ఫలసాయం రాకపాయా. చేళ్లునే నమ్ముకొని బతికేటోళ్లం. ఈసారి పెట్టుబడి ఏట్లో వేసినట్లుపాయా. ఇంకేక్కడి పండుగ. లేదు అనుకోకుండా నలుగురితో పాటు చేసుకున్నాం’ అంటూ బదులిచ్చాడు సుబ్బారెడ్డి.
 ఎల్లయ్య: ‘చేసుకున్నాం అన్నట్లుగా చేయాల్సిందే సుబ్బాడ్డీ’  
 సుబ్బాడ్డీ: ‘అది సరేనోయ్...పెభుత్తమే సంక్రాంతి సంబరాలు చేస్తుంటే పల్లెటూరోళ్లం మనమెందుకు చేసుకోకూడదు’  
 ఎల్లయ్య:  ‘నిజమే వాళ్లకేం ఏం చెప్పినా, ఏం మాట్లాడినా చెల్లుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడు ఏమైనా మాట్లాడుతాడు. ఇప్పుడు మల్లా ఓట్లు ఉన్నింటే జనమంటే అంతోఇంతో బయం ఉండేది. ఓట్లున్నీ ఒక్కసారే అయిపాయా. నువ్వు చేచ్చావుండేది, తప్పు అని ఎవరైనా చెబితే వినుకుండేటట్లు ఉన్నాడా. ఏమైనా మాట్లాడుతారు, ఏమైనా చేస్తారు’  నిట్టూర్చుతూ..
 సుబ్బాడ్డీ:  ఏంది ఎల్లయ్య అంత నిష్టూరంగా ఉన్నావ్.
 ఎల్లయ్య: ఉండగక ఏం చేయాలా సుబ్బా డ్డీ. ‘నిన్నమొన్నటి వరకూ రైతులందరి అప్పులు తీర్చే భారం నాదే, అన్నాడా. నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి, రైతుల కష్టసుఖాలు దగ్గరగా చూశాను. మీకోసమే పాదయాత్ర చేసినా, అని ఒక్కటేమైనా చెప్పినాడా. సీఎం సీట్లో కూర్చోగానే మాటమార్చేసినాడు.  మాఫీ కో సం బ్యాంకులకు ఆధార్‌కార్డులు, పాసుబుక్కులు, రేషన్ కార్డులు ఇవ్వమన్నాడా. ఇచ్చినామా, తీరా చూస్తే నీకెంత పోయిం దో చెప్పు. నాకైతే నాలుగువేల ఎనిమిది వందలు మాఫీ చేసినట్లు లిస్టులో వచ్చిం ది ’ బాధనంతా  వ్యక్తపరుస్తూ..
 సుబ్బాడ్డీ: ‘బాధపడొద్దులే ఎల్లయ్యా’ ఎల్లయ్య: ‘అయినా ఎవ్వరో ఇచ్చే సొమ్ము మనకెందుకు, దేవుడు సాయం చేస్తే చాళ్లే అనుకుంటే ఈమారు కరువు కాటేసింది. చంద్రబాబు పుణ్యామా అని ఇన్స్యూ రెన్సు రాకుండా పాయ’ అంటూ  మళ్లీ చెప్పబోతుంటే
 సుబ్బాడ్డీ: ‘అన్నింటికీ ఆయన్నే బాధ్యు న్ని జేచ్చాండావే ఎల్లయ్యా’ అంటూ సుబ్బాడ్డీ వ్యంగంగా మాట్లాడాడు.
 ఎల్లయ్య: ‘ చాల్లే  బాగా చెప్పుకొస్తున్నావ్ ఆయనే చెప్పినాడు. అప్పులు చెల్లించవద్దు, రుణాలు మాఫీ చేస్తానని, ఆయ న్ను నమ్ముకొనే కదా లోన్లు రెన్యువల్ చేసుకోకుండా ఉంటిమి ’ అంటూ   కాస్త ఘాటుగా చెప్పాడు
 సుబ్బాడ్డీ: ‘అంతా నువ్వు చెప్పేది నిజమే ఎల్లయ్యా. ఏం జేస్తాం, మోసకారి అని తెలిసి కూడా నమ్మి మోసపోయాం. ఇప్పుడు మనచేతిలో ఏం లేదు. ‘చచ్చినో డి పెళ్లికి వచ్చిందే కట్నం’ అనుకోవాలి ఎ ల్లయ్య భుజంపై చేయి వేస్తూ’ సుబ్బాడ్డీ.  
 ఎల్లయ్య: ‘మీకంటే మీపెద్దోళ్లు సంపాదించింది ఉంది, పైగా చేతికి ఎదిగిన కొడుకు కష్టాన్ని లెక్క పెట్టకుండా పనులు చేచ్చాండాడు. నేను ఆపొలాన్నే నమ్ముకొని బతికేటోన్ని, దాని ఫలసాయమే నాకు దిక్కు అయిపోయా, నీకు తెలియందీ ఏముంది’
 సుబ్బాడ్డీ: అవున్లే ఎల్లయ్య, ఎలెక్షన్లు ముందు రైతుల కష్టాలు పట్ల, అప్పులు పట్లా ఒకటేమైనా హామీలు ఇస్తాంటే రైతుల పాలిట చంద్రబాబు మరో బ్రహ్మనాయుడు అవుతాడు అనుకున్నాం. అందర్ని ఉన్నతిలోకి తెస్తాడు అనుకున్నాం ఇప్పుడేమో బ్రహ్మనాయుడు కాస్తా బుస్సిదొర అయ్యాడు.
 ఎల్లయ్య:  మావాడు కూడ చెప్పినాడు.  
 సుబ్బాడ్డీ: సర్లే ఎల్లయ్యా ఇప్పడేమి, పిల్ల లు పండగక్కు తొడకచ్చావా లేదా? ఏం కావాలో చెప్పు ఓయ్, ఉన్నదాంట్లోనే  సర్దుకున్నాం. నువ్వు పండగ చేసుకోలేదంటే, నాకైనా ముద్ద ఎట్లా దిగాలా.
 ఎల్లయ్య:  పర్వాలేదులే సుబ్బాడ్డీ, ఏదో ఉన్నదాంట్లోనే పండుగ చేసుకుంటున్నాంలే.  అవసరమైతే మీఇంట్లోకి వచ్చి చేరిపోనూ రెడ్డీ.
 సుబ్బాడ్డీ: సరే అబ్బీ వచ్చినాడు, బోరింగు కాడికి పోయి ఎద్దుల పై కడుక్కోని వస్తాం, రేపంతా ఎద్దుల పండుగే కదా. మళ్లా రాఓ య్, అట్లాపోయి కోడిపందెం జూసీ వద్దాం.
 ఎల్లయ్య: సరే సుబ్బాడ్డీ పోయి వస్తానుల్లే అంటూ ఎల్లయ్య బయలుదేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement