పుష్కరం వయసు నుంచి పుష్కర స్నానం | pushkaralu bath in first time 82 years old man | Sakshi
Sakshi News home page

పుష్కరం వయసు నుంచి పుష్కర స్నానం

Jul 15 2015 3:55 AM | Updated on Sep 3 2017 5:29 AM

పుష్కరం వయసు నుంచి పుష్కర స్నానం

పుష్కరం వయసు నుంచి పుష్కర స్నానం

పుష్కరం (12 ఏళ్లు) వయసు లో తొలి పుష్కర స్నానం 1943లో తాళ్లపూడి వద్ద గోదావరి నదిలో చేశా.

స్టీమర్‌రోడ్డు (నరసాపురం) : పుష్కరం (12 ఏళ్లు) వయసు లో తొలి పుష్కర స్నానం 1943లో తాళ్లపూడి వద్ద గోదావరి నదిలో చేశా. ప్రస్తుతం నా వయస్సు 84 ఏళ్లు.  ఇప్పటికీ 7  సార్లు పుష్కర స్నానం చేశాను. అందులో అయిదుసార్లు నా భార్య లక్ష్మీకాంతంతో కలిసి చేశాను’ అన్నారు పాలకొల్లుకి చెందిన రేపాక వెంకట మామిళ్లయ్య. ఆ దంపతులు నరసాపురం వలంధర్‌రేవులో పుష్కరస్నానం చేశారు. ‘1957లో మా వివాహం జరిగింది. తరువాత 1967లో పుష్కరాలు వస్తే రాజమండ్రి వెళ్లి స్నానం చేశాం. దంపతులుగా కలిసి   5సార్లు పుష్కర స్నానం చేశాం. 2003లోనూ రాజమండ్రి వెళ్లి పుష్కరస్నానం చేశాం.  అప్పట్లో ఇన్ని ఏర్పాట్లు లేవు. జనం కూడా అంతగా లేరు. ప్రస్తుతం అధికారులు చేసిన ఏర్పాట్లు చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement