'మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దు' | palle raghunatha reddy blames ktr | Sakshi
Sakshi News home page

'మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దు'

Jun 19 2015 6:55 PM | Updated on Aug 15 2018 9:27 PM

'మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దు' - Sakshi

'మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దు'

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని మండిపడ్డారు.  'కేటీఆర్ సంస్కారం నేర్చుకో. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.  చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదు. మీ నాన్నను  ఆదర్శంగా తీసుకోవద్దు' అంటూ కేటీఆర్ ను పల్లె ఎద్దేవా చేశారు.

 

సెక్షన్-8ను అమలు చేయాలని గవర్నర్, కేంద్రాన్ని కోరతామని ఈ సందర్భంగా పల్లె పేర్కొన్నారు.  చంద్రబాబు ఆంధ్రా పోలీసులను భద్రతగా పెట్టుకుంటే తప్పేముందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement