మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి బంధువులపై చీటింగ్ కేసు | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి బంధువులపై చీటింగ్ కేసు

Published Mon, Oct 20 2014 2:23 AM

Cheating case of relatives, former MLA virasivareddi

ప్రొద్దుటూరు క్రైం: కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తనయుడు అనిల్‌కుమార్‌రెడ్డి, అల్లుడు వేణుగోపాల్‌రెడ్డిలపై ఆదివారం రాత్రి త్రీ టౌన్  పోలీస్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. వారితో పాటు మరో 9 మందిపై పోలీ సులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు...దువ్వూరు మండలం చింతకుంటకు చెందిన నందిమండలం బయపురెడ్డి అనే వ్యక్తి తన 2.16 ఎకరాల భూమిని 2012లో విక్రయించాడు. వచ్చిన డబ్బుతో ఏదైనా ఇల్లు తీసుకోవాలని భావిం చాడు.

అయితే ఈ లోగా కొమ్ముపాళెం రాజశేఖర్ అనే వ్యక్తి బయపురెడ్డి  వద్దకు వచ్చి ఇల్లు ఉందని చెప్పాడు.  నెహ్రూరోడ్డులోని ఓ ఇంటిని  పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా కృపాసాగర్ అనే వ్యక్తిచే హక్కు పొంది ఉన్నానని..  బయపురెడ్డికి చెప్పాడు. దానికి  సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్‌లను కూడా చూపించడంతో బయపురెడ్డి నమ్మాడు. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న మేరకు రూ.20 లక్షలు తీసుకొని  రమ్మని  చెప్పడంతో 2013 మార్చి 7న బయపురెడ్డి డబ్బుతో పాత బస్టాండ్‌కు వెళ్లాడు.

అక్కడికి  వెళ్లగా రాజశేఖర్‌తో పాటు అనిల్‌కుమార్‌రెడ్డి, కల్పలత చండ్రాయుడు, మురళి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రాజశేఖర్ డబ్బు ఇవ్వు రిజిష్టర్ చేస్తామని చెప్పగా అనుమానంతో బయపురెడ్డి డబ్బు ఇవ్వలేదు. దీంతో అక్కడే ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు అతని  స్నేహితులు కృపాసాగర్ నుంచి ఒరిజనల్ పవర్ ఆఫ్ అటార్ని రాజశేఖర్ పొంది ఉన్నాడు కదా, నీకేం భయం లేదులే  అని మోసపూరితమైన మాటలు చెప్పారు.  వారి మాటలు నమ్మిన బయపురెడ్డి రూ. 20 లక్షలు వారికి  ఇచ్చాడు.

ఆ డబ్బును అందరూ పంచుకున్న తర్వాత రిజిష్టర్ ఆఫీసుకు  వచ్చి బయపురెడ్డికి రిజిష్టర్ చేయించారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30న కృపాసాగర్ స్థలంపై తన చెల్లెలు వైఎస్ శోభారాణికి హక్కు ఉందని పేపర్ ప్రకటన ఇచ్చాడు. అది చూసిన బయపురెడ్డి  తనకు కూడా పూర్తి హక్కు ఉందని, సంబంధిత స్థలం డాక్యుమెంట్‌లు ఉన్నాయని పత్రికా ప్రకటన ఇచ్చాడు. తర్వాత అనుమానం వచ్చిన బయపురెడ్డి ఈ నెల 18న రిజిష్టర్ ఆఫీస్‌లో విచారించగా మోసం  జరిగిందని గ్రహించాడు. దీంతో తనకు మాయ మాటలు  చెప్పి తన దగ్గర రూ. 20 లక్షలు తీసుకొని  మోసం చేసిన కొమ్ముపాళెం  రాజశేఖర్, అనిల్‌కుమార్‌రెడ్డి, అతని స్నేహితులపై చీటింగ్ కేసు నమోదైంది.

Advertisement
Advertisement