17న సీఎం చంద్రబాబు రాక! | chandra babu naidu comes on 17th to district | Sakshi
Sakshi News home page

17న సీఎం చంద్రబాబు రాక!

Oct 11 2014 4:19 AM | Updated on Oct 17 2018 5:10 PM

17న  సీఎం చంద్రబాబు రాక! - Sakshi

17న సీఎం చంద్రబాబు రాక!

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 17న జిల్లా పర్యటనకు రానున్నారు.

ఏలూరు, ఉండి నియోజకవర్గాల్లో పర్యటన
ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 17న జిల్లా పర్యటనకు రానున్నారు. షెడ్యూల్ అధికారికంగా ఖరారు కానప్పటికీ, అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. చంద్రబాబు ఈనెల 17న జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఏలూరులో నిర్మించిన ఎన్‌జీవో హోమ్‌ను ఆ రోజు సీఎం ప్రారంభిస్తారని చెబుతు న్నారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జారీ చేసే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడతారని సమాచారం.

అనంతరం చంద్రబాబు ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కలవపూడిలో జరిగే జన్మభూమి- మా ఊరు గ్రామ సభలో పాల్గొంటారు. చినకాపవరం వద్ద డెల్టా ఆధునికీకరణ పనులకు శంకుస్థ్ధాపన  చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ కాళ్ల మండలంలో శుక్రవారం పర్యటించి, సీఎం పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement