నంద్యాల కాంగ్రెస్‌ అభ్యర్థిగా అబ్దుల్‌ ఖాదర్‌ | Abdul Khader as Nandyal Congress candidate | Sakshi
Sakshi News home page

నంద్యాల కాంగ్రెస్‌ అభ్యర్థిగా అబ్దుల్‌ ఖాదర్‌

Aug 2 2017 1:48 AM | Updated on Oct 19 2018 8:10 PM

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గడ్డం అబ్దుల్‌ ఖాదర్‌ పేరును ఖరారు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ప్రకటించారు.

సాక్షి, అమరావతి: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గడ్డం అబ్దుల్‌ ఖాదర్‌ పేరును ఖరారు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిర భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 4 లేదా 5వ తేదీన నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ కుటుంబానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ 1994 నుంచి ట్రేడ్‌ యూనియన్‌ కార్యక్రమాల్లో పాల్గొనేవారని, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement