పాయకరావుపేటలో 144 సెక్షన్ | 144 section in payakaraopeta | Sakshi
Sakshi News home page

పాయకరావుపేటలో 144 సెక్షన్

Apr 13 2016 8:14 AM | Updated on Sep 3 2017 9:51 PM

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో రెండు కాలనీ వాసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో రెండు కాలనీ వాసుల మధ్య బుధవారం ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు కాలనీ వాసులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘర్షణ చోటు చేసుకున్న ప్రదేశానికి చేరుకుని... 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే పాయకరావుపేటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement