-
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
సిమ్లా: సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని కంగనా రనౌత్ దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య సింగ్ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.‘‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్‌ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్‌లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్ ప్రదేశ్‌కు కేవలం టూర్ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్‌కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్‌సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్‌పూర్‌లలో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫతితాలు జూన్ 4న వెలువడనున్నాయ. -
బెయిలా.. రిమాండ్ కొనసాగింపా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు. కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా. -
నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
ఎటావా/సీతాపూర్: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కనపెట్టి, కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే ఆరాటపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి తాను శ్రమిస్తున్నానని చెప్పారు. తనకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బిడ్డలు లేరని, ప్రజల బిడ్డల శ్రేయస్సు కోసం తాము తపన పడుతున్నామని వివరించారు.ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా, దౌరాహ్రాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే 1,000 సంవత్సరాల పాటు భారత్ శక్తివంతమైన దేశంగా కొనసాగడానికి పునాది రాయి వేస్తున్నానని ప్రకటించారు. తాను ఉన్నా, లేకున్నా భారతదేశం ఉంటుందని, అందుకే దేశాన్ని శక్తివంతంగా మార్చాలని సంకలి్పంచానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టల నాయకులు కేవలం సొంత భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నేతలు వారి కుటుంబాలకు, ఓటు బ్యాంక్‌కు మాత్రమే లబ్ధి చేకూర్చాలని తహతహలాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... మోదీ వారసత్వం అంటే ఇదే.. ‘‘వారసత్వ పార్టీల నేతలు సాధించేదేమిటి? కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి సంపాదించుకోవడం తప్ప వారికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఏం తెలుసు? ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి, కన్నౌజ్, ఎటావా లోక్‌సభ స్థానాలను కొందరు వారి సొంత సామ్రాజ్యాలు అనుకుంటున్నారు. మరికొందరు ఆమేథీ, రాయ్‌బరేలీని వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. నా వారసత్వం ప్రజలందరికీ చెందుతుంది. 2047లో పేద ప్రజల కుమారులు, కుమార్తెలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కావాలన్నదే నా కోరిక. రాజకుటుంబాల వారసులు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యే దుష్ట సంప్రదాయాన్ని ఈ చాయ్‌వాలా బద్ధలు కొట్టాడు. సమాజంలో దురాచారాలపై నిషేధం కోసం పోరాడిన రాజారామ్ మోహన్ రాయ్‌ను ఇప్పటికీ స్మరించుకుంటున్నాం. పాత సంప్రదాయానికి చరమగీతం పాడేసి, పేదల బిడ్డలు సైతం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేసిన ప్రధానమంత్రి ఉండేవాడు, ఆయన ఒక చాయ్‌వాలా అని భవిష్యత్తు తరాలు చెప్పుకొనే రోజు వస్తుంది. మోదీ వారసత్వం అంటే పేదలకు పక్కా ఇళ్లు, కోట్లాది మంది మహిళలకు మరుగుదొడ్లు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్, కుళాయి నీళ్లు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మట్లేదు కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారు విపక్షాలకు దూరంగా ఉంటున్నారు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మడం లేదు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలతో మైనార్టీలూ లబ్ధి పొందుతున్నారు. దూరమవుతున్న ముస్లిం ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కొత్త ఆట మొదలుపెట్టాయి. బుజ్జగింపు వ్యవహారాలకు దిగుతున్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని బాబా సాహెబ్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ స్పష్టం చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మొండిగా వాదిస్తున్నాయి. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా? కాంగ్రెస్ రాజకుమారుడు ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగాడు. కోటుపై జంధ్యం కూడా ధరించాడు. ఈసారి మాత్రం ఆయన ఆలయాలకు వెళ్లడం మానేశారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత ఆలయం నిర్మించుకున్నాం. దేశ ప్రజలంతా సంతోíÙంచారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. నేను ద్వారకలో సముద్రగర్భంలో కృష్ణుడికి పూజలు చేయడాన్ని కాంగ్రెస్ రాజకుమారుడు విమర్శించాడు. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా?’’ అని ప్రధాని మోదీ ఆక్షేపించారు. అయోధ్య బాలరాముడి సేవలో మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడిని మోదీ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. అనంతరం అయోధ్యలో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. -
నిప్పుతో చెలగాటమా!
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పేరిట హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఈసారి 400 స్థానాల్లో గెలిచి కొన్ని రాష్ట్రాల్లో మరింత మెరుగైన రాజకీయప్రతిభ కనబరచనుందని వ్యాఖ్యానించారు. పీటీఐతో ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాహుల్ గాంధీలో ఫైర్ లేదు ‘‘ రాహుల్ గాం«దీలో గొప్ప నాయకత్వ లక్షణం(ఫైర్)లేదుగానీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి విద్వేష మంటలు రాజేసే ఫైర్ చాలా ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సామాజిక సామరస్యాన్ని నాశనంచేస్తోంది. మత విద్వేషాలకు కారణమవుతోంది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తోంది. మేం గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి నిర్ణయాలను అమలుచేస్తాం.రాజ్యాంగపీఠికను బీజేపీ ఎన్నటికీ మార్చబోదు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్సే ఇప్పటికి 80 సార్లు రాజ్యాంగసవరణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ పీఠికలోనూ మార్చులు చేశారు. జనాల్లో భయాలు పెంచి వారి మద్దతు సాధించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రిజర్వేషన్లు తొలగిస్తామని మాపై అబద్ధాల బురద చల్లుతోంది’’ ప్రశంసలో ఆంతర్యమేంటి?‘‘పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ ఇటీవల రాహుల్ గాం«దీని నెహ్రూతో పోలుస్తూ ప్రశంసల్లో ముంచెత్తడం నిజంగా ఆందోళనకర విషయమే. భారత్‌ను అస్థిరపరచాలని చూసే శత్రుదేశం నేత రాహుల్‌ను ప్రశంసించడంలో ఉన్న ఆంతర్యమేంటో? అసలు పాక్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధమేంటి? సంపద పంపిణీ విషయంలో శనివారం కూడా ఆయన పొగిడారు. ఆయన మాటల వెనుక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచి్చతంగా వివరణ ఇవ్వాలి. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేద్దామని పాక్ ప్రయతి్నస్తోంది. కానీ పాక్‌కు అంత సత్తా లేదు’’ 400 సీట్లు ఖాయం ‘‘ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుంది. బీజేపీ 370కిపైగా స్థానాల్లో గెలుస్తుంది. పశి్చమబెంగాల్లో మరిన్ని సీట్లు సాధిస్తాం. తమిళనాడులోనూ మెరుగవుతాం. కేరళలో బోణీ కొడతాం. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ మెరుగైన సీట్లు సాధిస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో 75 సీట్లదాకా గెలుస్తాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలికలు, సీట్ల సర్దుబాటు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ సీట్లు సాధిస్తాం. తొలి రెండు దశల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడం వల్ల బీజేపీకి వచి్చన నష్టమేమీ లేదు’’ సంపద పునఃపంపిణీ సరికాదు‘‘ కాంగ్రెస్ చెబుతున్నట్లు సంపదను పునఃపంపిణీ చేస్తామన్న విధానం సహేతుకంకాదు. అర్జెంటీనా, వెనిజులా దేశాలు దీనిని అమలుచేసి చేతులుకాల్చుకున్నాయి. విపరిణామాలను ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ ఇలా చేస్తే భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలి వెనిజులా మాదిరిగా ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. భారత్‌పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారు’’ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే ‘‘ పాక్ ఆక్రమిత కశీ్మర్ ముమ్మాటికీ మనదే. అంతమాత్రాన పీవోకేను బలవంతంగా ఆక్రమించాల్సిన అవసరం లేదు. జమ్మూకశ్మీర్‌లో సాకారమైన అభివృద్ధిని చూశాక పీఓకే ప్రజలే భారత్‌లో విలీనంకావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశీ్మర్‌లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల(ఏఎఫ్ఎస్పీఏ) చట్టంను తొలగించాల్సిన సమయం దగ్గరపడింది. దీనిపై కేంద్ర హోం శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. అయితే ఖచి్చతంగా ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం’’ సరిహద్దు చర్చలు సానుకూలం ‘‘ తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ జవాన్ల ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేసేందుకు చర్చల ప్రక్రియ సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ నమ్మకం పెట్టుకుంది. చైనా కూడా అదే నమ్మకంతో చర్చలకు ముందుకొచి్చంది. సరిహద్దు వెంట మౌలికవసతుల పటిష్టానికి త్వరితగతిన ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తున్నాం. సరిహద్దు త్వరలో మరింత సురక్షితంగా ఉండబోతోంది’’ -
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన దురుసుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి డీకే వెళ్లారు. అక్కడ కారు దిగగానే ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు.దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ వీడియో కాంగ్రెస్ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డీకే పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. — BJP Karnataka (@BJP4Karnataka) May 5, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement