-
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై మహిళా ఉద్యోగి వేధింపుల అభియోగం మోపిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ, ఆమె పోలీసులు మినహా 100 మందికి సంబంధిత సీసీటీవీ ఫుటేజీని చూపుతామని రాజ్ భవన్ అధికారిక ప్రకటన చేసింది.రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజలు తమ అభ్యర్థనలు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులు గురువారం ఉదయం గవర్నర్ హౌస్ లోపల ఫుటేజీని చూడటానికి అనుమతిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్గవర్నర్సీవీ ఆనందబోస్ తననువేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. -
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్‌కు చేరింది. -
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
కోల్‌కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్‌లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్‌ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండటంలో పౌష్టిక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తినటం వల్ల శరీరకంగా బలంగా ఉంటాం. సమతుల ఆహారం తీసుకోవటంతో వ్యాధులు సైతం దరిచేరవు. ఇందుకోసమే.. తాజాగా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొన్ని ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.భారతీయులకు ఈ ఆహార మార్గదర్శకాలను పోషకాహార పరిశోధనా సంస్థ, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్), హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఈ 17 ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలతో కూడిన ఈ బుక్‌ను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డెరెక్టర్ డాక్టర్. హేమలత బుధవారం విడుదల చేశారు.ముఖ్యమైన 17 ఆహార మార్గదర్శకాలు ఇవే..1. సమతుల ఆహారం కోసం అన్ని రకాల ఆహారాలను తినాలి.2. గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు సాధారణం కంటే కొంచం అధిక మోతాదులో పౌష్టిక ఆహారం తీసుకోవాలి.3. మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా శిశువులకు రెండేళ్లు వచ్చే వరకు ఆపై కూడా తల్లి పాలు అందించాలి. 4. శిశువులకు ఆరు నెలల తర్వాత ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన ఘన, ద్రవ ఆహారాన్ని తినిపించాలి.5. చిన్నపిల్లలు అనారోగ్యం పాలు కాకుండా.. బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలినంత ఆహారాన్ని అందించాలి.6. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి.7. ఆహారంలో నూనెను సాధారణ మోతాదులో వాడాలి. మంచి కొవ్వు కోసం నూనె గింజలు, పప్పులు, అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి.8. నాణ్యమైన ప్రోటిన్, ఆమైనో యాసిడ్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. కండరాల దృఢత్వం కోసం ప్రోటిన్ సప్లిమెంట్లుకు దూరంగా ఉండటం మంచిది.9. జీవనశైలిలో ఉబకాయం, అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.10. ఆరోగ్యం కోసం శరీరాన్ని కదిలిస్తూ.. రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి.11. ఆహారంలో ఉప్పును అధికంగా తినటం తగ్గించాలి. 12. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తినాలి13. మంచి ఆహార తయారీ పద్దతులు పాటించాలి.14. అధిక మోతాదులో శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.15. అధిక కొవ్వు, తీపి ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.16. వృద్ధులు ముఖ్యంగా పౌష్టిక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.17.ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం కోసం.. ఆహార పదార్థాల మీద ఫుడ్ లెబుల్స్‌ను చదవాలి. -
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాహుల్ గాంధీ మెంటర్ ఆలోచన, వైఖరిని వెల్లడిస్తుందని అన్నారు.లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన.. తాజాగా, జాత్యహంకార వ్యాఖ్యలతో తీవ్ర దుమారాన్ని రేపారు. పిట్రోడా జాతి వివక్షకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా స్పందించారు. నేను దక్షిణ భారతీయురాలిని. నేను భారతీయురాలిగా కనిపిస్తున్నాను అని అన్నారు.కానీ రాహుల్ గాంధీకి గురువు పిట్రోడా జాత్యహంకారానికి మనమందరం ఆఫ్రికన్, చైనీస్, అరబ్, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నాము. మీ ఆలోచనా విధానాన్ని, మీ వైఖరిని వెల్లడించినందుకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలు ఇండియా కూటమికే అవమానం అని మండ్డారు. కాగా, పిట్రోడా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఖండించింది. ‘పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆమోదయోగ్యం కాదు’ అని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. I am from South India. I look Indian! My team has enthusiastic members from north east India. They look Indian! My colleagues from west India look Indian! But, for the racist who is the mentor of @RahulGandhi we all look African, Chinese, Arab and the White! Thanks for… pic.twitter.com/UzXi4ndwhk— Nirmala Sitharaman (Modi Ka Parivar) (@nsitharaman) May 8, 2024
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement