-
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
నేపాల్ భారత భూభాగాలైన లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీలు కలిగి ఉన్న మ్యాప్‌తో కొత్త రూ.100 కరెన్సీ నోటును ముద్రించాలని నిర్ణయించింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో వివాదాస్పద భూభాగాలను నేపాల్ కొత్త మ్యాప్‌లో చేర్చాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి రేఖా శర్మ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ భూభాగాలకు సంబంధించి ఇండియా-నేపాల్ మధ్య భిన్నాభిప్రాయలున్నాయి.వివాదాస్పద భూభాగాలతో కూడిన మ్యాప్‌ను నేపాలీ రూ.100 నోట్‌పై ముద్రించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఏప్రిల్ 25, మే 2వ తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొత్త మ్యాప్ రీడిజైన్‌కు ఆమోదం లభించినట్లు ఆమె చెప్పారు.ఇదీ చదవండి: ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..’ నిర్మలాసీతారామన్ వివరణఅసలు వివాదం ఏమిటి..?లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు నవంబర్ 2019లో భారత్‌మ్యాప్‌లో చేర్చారు. అవి ఇండియా తమ భూభాగాలుగా భావిస్తోంది. మే 2020లో నేపాల్ అదే భూభాగాలతో రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మే 8, 2020న లిపులేఖ్ మీదుగా కైలాష్ మానస సరోవరాన్ని కలిపేలా రహదారిని ప్రారంభించాలని భారత్ ప్రయత్నించింది. దాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ భారత్‌కు నోట్‌ను పంపించింది. దాంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా గుండా వెళ్లే రహదారి పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని స్పష్టం చేసింది. -
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
భార్యను అతికిరాతకంగా చంపిన మాజీ మంత్రి
అస్తానా: మధ్య ఆసియా దేశం కజకస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఓ మాజీ మంత్రి తన భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మానవ మృగం కోర్టు విచారణ ఎదుర్కొంటుండగా.. కఠిన శిక్ష పడాలంటూ ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.కువాన్దిక్ బిషింబయెవ్(44) కజకస్తాన్ దేశపు మాజీ ఆర్థిక మంత్రి. ఈయన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్లో గతేడాది నవంబర్‌లో ఆయన సతీమణి సల్తానత్ నుకెనోవా(31) అనుమానాస్పద రీతిలో మృతి చెందిది. అంతకు ముందు ఒకరోజు అంతా ఆ జంట ఆ హోటల్లోనే గడిపింది.అయితే విచారణలో ఆయనే ఆమెను దారుణంగా హింసించి చంపినట్లు తేలింది. దీంతో ఆయన కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు ఆ హోటల్ సీపీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. జుట్టుపట్టి ఈడ్చి కొట్టి.. ఇష్టానుసారం తన్ని.. సుమారు ఎనిమిది గంటల పాటు ఆ కిరాతకం కొనసాగింది. రక్తపు మడుగులో అచేతనంగా భార్య పడి ఉన్నప్పటికీ ఆమె బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బిషింబయెవ్ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. చివరకు 12 గంటల తర్వాత ఆంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.తలకు, ముక్కుకు బలమైన గాయం కావడం, ఒంటిపై పలు చోట్ల గాయాల్ని శవ పరీక్షలో గుర్తించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలన్నింటిని మాయం చేసేందుకు బిషింబయెవ్ ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే యత్నం చేశాడు కూడా.అయితే.. 8 గంటలపాటు సాగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త అకృత్యం వెలుగు చూసింది. భార్యను అలా ఎందుకు చంపాడో మాత్రం ఇంకా నోరు విప్పలేదు నిందితుడు. అయితే ఆమెను అంత క్రూరంగా చంపిన ఆ మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గృహ హింస చట్టం గురించి విస్తృతంగా చర్చ జరిగింది అక్కడ. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement