పెరిగిన ‘కుంభం’ ఆస్తులు | Sakshi
Sakshi News home page

పెరిగిన ‘కుంభం’ ఆస్తులు

Published Thu, Nov 9 2023 1:40 AM

-

భువనగిరి : కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆస్తులు 2018 అఫిడవిట్‌తో పోల్చితే పెరిగాయి. ప్రస్తుతం ఆయన పేరున చరాస్తులు రూ.51,04,62,977, భార్య పేరు మీద రూ.13,78,03,263, కుటుంబంలో వివాహం కాని సభ్యులు ఒకరి పేరునరూ.1,55,290 ఉన్నట్లు ప్రకటించారు. కాగా అప్పులు రూ.13,00,60,000 ఉన్నట్లు చూపించారు. తనపై స్థిరాస్తులు రూ.120,51,99,550, భార్యపై రూ.24,98,73,450, కుటుంబీకులు ఒకరి పేరున రూ.1,10,00,000 ఉన్న ట్లు ప్రకటించారు. 2018లో చరాస్తులు రూ.58,05,99,360 ఉండగా.. ఈ సారి రూ.64,84,21,530 ఉన్నట్లు ప్రకటించారు. 2018లో స్థిరాస్తులు రూ.93,27, 81,750, ఈసారి రూ.146,60,73,000 ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు 2018లో రూ.9,07,64,121 ఉండగా రూ.13,00,60,000 పెరిగినట్లు చూపించారు.

ఫ 2018తో పోల్చితే ప్రస్తుతం చరాస్తులు రూ.6,78,22,170

ఫ స్థిరాస్తులు రూ.53,32,91,250

‘గూడూరు’ ఆస్తి రూ.72.58 కోట్లు

భువనగిరి : బీజేపీ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి బుధవారం నామినేషన్‌ పత్రంతో పాటు ఆస్తులకు సంబందించి అఫిడవిట్‌ను సమర్పించారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం కుటుంబ మొత్తం ఆస్తులు రూ.72,58,72,901 ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.1,93,90,166, స్థిరాస్తులు రూ.70,64,82,735 ఉన్నట్లు చూపించారు. చరాస్తుల్లో ఆయనపై రూ.30,03,631, భార్య పేరు మీదగా రూ.1,42,47,856 ఉన్నట్లు ప్రకటించారు. హెచ్‌యూఎఫ్‌ (ఉమ్మడి కుటుంబ ఆస్తుల కింద) కింద రూ.24,38,679 ఉన్నట్లు చూపించారు. స్థిరాస్తుల్లో తన పేరు మీద రూ.28,70,15,815, భార్య పేరు మీదగా రూ.16,23,82,140 ఉండగా హెచ్‌యూఎఫ్‌ కింద రూ.25,70,85,080 ఉన్నట్లు ప్రకటించారు. అప్పులు లేనట్లు చూపించారు. నారాయణరెడ్డి తనపై మూడు కేసులు ఉన్నట్లు చూపించారు.

Advertisement
Advertisement