జగన్‌ పాలనలోనే నిజమైన అభివృద్ధి | Sakshi
Sakshi News home page

జగన్‌ పాలనలోనే నిజమైన అభివృద్ధి

Published Fri, Apr 19 2024 1:15 AM

భీమవరం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో విద్యార్ధులతో మాట్లాడుతున్న అజేయ్‌కల్లాం  - Sakshi

త్యాగధనులు..

పోలవరం నిర్వాసితులు

భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్‌): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే సంక్షేమం, అభివృద్ధి రెండూ జరిగాయని మాజీ చీఫ్‌ సెక్రటరీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజేయ కల్లం అన్నారు. భీమవరంలోని పీసీఆర్‌ కల్యాణ మండపంలో ఓపెన్‌మైండ్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్‌ నాడు–నేడు’ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను కమిషనర్‌ స్థాయి నుంచి చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఉద్యోగానుభవం ఉందన్నారు. ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమపాళ్లల్లో జరిగాయనేందుకు ఉదాహరణగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్‌ హర్బర్లు, 17 మెడికల కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఆస్పత్రి భవనాలు ఉన్నాయన్నారు. నేటి ప్రచారమాధ్యమాలు తప్పుడు సందేశాలు, సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని, వాటిని గుడ్డిగా నమ్మకుండా వాస్తవం తెలుసుకోవాలని హితవు చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలియచేయడానికే ఓపెన్‌ మైండ్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిని సమాజంలోని మేధావులు, అధ్యాపకులు, డాక్టర్లు, న్యాయవాదులు, విద్యార్థులతోపాటు సమాజంలోని ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగులంతా గ్రహించాలన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.మూడువేల కోట్లు పెట్టుబడులు వస్తే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.78 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. అలాగే రాష్ట్రంలోి 311 భారీ పరిశ్రమలు రావడంతో 2014–19లో పారిశ్రామికాభివృద్ధి రేటు 3.2 శాతం ఉండగా, 2019 నుంచి 2024 మధ్య 12.8 శాతానికి పెరిగిందని వివరించారు. అంతేగాకుండా రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్రానికి కొత్తగా 3.69 లక్షల ఎంఎస్‌ఈల ద్వారా 25 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 45,975 ప్రభుత్వ పాఠశాలలను రూ.1,800 కోట్లతో అభివృద్థి చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిందన్నారు. అలాగే రూ.1,600 కోట్ల వ్యయంతో ఆస్పత్రులను అభివృద్ధి చేశారన్నారు.

నిజాలు తెలుసుకోవాలి : అభివృద్ధి అంటే కనిపించే నాలుగు భవనాలు మాత్రమే కాదని, పేదరికం తగ్గుదల, మహిళ సాధికారత, తలసరి ఆదాయం పెరుగుదల, ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి ఓపెన్‌మైండ్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ చైర్మన్‌, ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో, ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ పాలనలో జరిగిన అభివృద్ధిపై విద్యావంతులు, మేధావులు ఓపెన్‌మైండ్‌తో చర్చించి వాస్తవాలను ప్రజలకు తెలియాజేయాలన్నారు. జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని తప్పుడు సందేశాలు, సమాచారాలను ప్రచారం చేస్తున్నవారు నిజాలు తెలుసుకోవాలన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్‌ పాలనలో 2.7 లక్షల ఉద్యోగులు కల్పించారన్నారు. అలాగే 31 లక్షల మందికి 68,700 ఎకరాల భూమిని ఇళ్లు స్థలాలుగా పంచారన్నారు. ఇళ్లస్థలాల కోసం రూ.75,670 కోట్లు ఖర్చు చేశారన్నారు.

కుక్కునూరు: రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితుల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. గురువారం ఆయన పోలవరం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలకి్‌ష్మ్‌తో కలిసి కుక్కునూరు మండలంలోని ఇసుకపాడు, లంకాలపల్లి, మంజంవారిగుంపు, నల్లకుంట, కుక్కునూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో బాలరాజు, రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ సర్వేలో అవగాహన రాహిత్యంతో సర్వే నిర్వహించడంతో ముంపులో ఉన్న భూములకు పరిహారం అందలేదని, ముంపునకు గురయ్యే గ్రామాలను ముంపులో లేనట్టు పేర్కొనడం జరిగిందన్నారు. దీంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ విషయాలన్నీ తనకు తెలుసునని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రాజెక్టు నిధుల కోసం కేంద్రంతో పోరాడుతూ ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వస్తున్నారన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగానే నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని వెంటనే పరిష్కరించే అవకాశం లేకుండా పోయిందన్నారు. నిజాయతీ గల వ్యక్తి కనుకనే గత వరదల సమయంలో గొమ్ముగూడెం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభాముఖంగా కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్లనే మాట నిలబెట్టుకోలేకపోయానని బహిరంగంగా నిర్వాసితులకు వెల్లడించారన్నారు. కానీ నిర్వాసితులకు జగనన్న తప్పక న్యాయం చేస్తారని అన్నారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీలను ఏ విధంగా అయితే ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారో, నిర్వాసితుల విషయంలో కూడా అదే విధంగా మాట నిలబెట్టుకుంటారని, దీనిపై ఎటువంటి సందేహం లేదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుక్కునూరు పంచాయతీ పరిధిలో ప్రతి వీధి తిరిగి పేద కుటుంబాలకు మేలు జరగాలంటే మరోసారి పోలవరం గడ్డమీద వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు కుంజా నాగేశ్వరరావు, ఎంపీపీ చేబ్రోలు గీతావాణి, సర్పంచ్‌ రావు మీనా, వైస్‌ ఎంపీపీలు గాడిద రామచంద్రం, తాండ్ర రాజేష్‌, ఎంపీటీసీలు సోడే సాధు, కుండా సూరి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు గంగుల రమణారెడ్డి, మాదిరాజు వెంకన్నబాబు, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కుచ్చర్లపాటి నరసింహారాజు, రావు వినోద్‌, రామిరెడ్డి, ఆవుల బాలకృష్ణారెడ్డి, కోటగిరి నళిని ప్రవార్‌, రాయి రవి, మల్లెల చంటి నాయుడు, సుర్ల రాము, కో–ఆప్షన్‌ సభ్యుడు సలీం పాషా పాల్గొన్నారు.

ముగిసిన రైల్వే వారోత్సవాలు

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రపంచలోనే అతి పెద్ద వ్యవస్థగా భారతదేశ రైల్వేస్‌ నిలిచిందని, ప్రయాణికుల సౌకర్యాల కోసం స్టేషన్లను కూడా ఆధునికీకరణ చేశారని భీమవరం పట్టణ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏంవీ రమణ అన్నారు. రైల్వే వారోత్సవాల ముగింపులో భాగంగా భీమవరం టౌన్‌ రైల్వేస్టేషన్‌లో హమాలీలకు, కూలీలకు నూతన వస్త్రాలను శ్రీవిజ్ఞానవేదిక, జంక్షన్‌ టౌన్‌ రైల్వేస్టేషన్ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు ఆర్థిక సహాయంతో 25 మంది హమాలీలకు, ఆరుగురు స్వీపర్లకి నూతన వస్త్రాలు అందించారు. టౌన్‌ స్టేషన్‌ సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాస్‌, సీసీఎస్‌ టి.ఉదయిని, రైల్వే సీఆర్‌పీఎఫ్‌ దస్తగిరి పాల్గొన్నారు.

స్థానిక వార్తలు

విద్యా విధానంపై అవగాహన అవసరం

భీమవరం: విద్యార్థులు విద్యావిధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రభుత్వ మాజీ చీఫ్‌ సెక్రటరీ అజేయ్‌కల్లాం అన్నారు. భీమవరంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో గురువారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ నాడు–నేడు అనే అంశంపై ఆయన మాట్లాడారు. నేటి ప్రభుత్వం విద్యావిదానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యనభ్యసించేలా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నతిస్థితికి చేరాలన్నారు. ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ కమిషన్‌ సీఈవో డాక్టర్‌ ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను తల్లిదండ్రులకు పూర్తిగా తెలియచేయాలన్నారు. విద్యలో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడంతో తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గుతుందన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యతో మెరుగైన అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ చీఫ్‌ కమిషనర్‌ పి.విజయబాబు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రొ, చైర్మన్‌ వత్సవాయి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో అభివృద్ధి అద్భుతం

అభివృద్ధిపై వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ప్రచారా సాధనాలు ఉపయోగించుకుని చేస్తున్న గ్లోబెల్‌ ప్రచారానికి మేధావులు, విద్యార్థులు తెరదించాలని ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌, ఏపీ అధికార బాషా కమిషనర్‌ పి.విజయబాబు అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అద్భుతంగా జరిగిందన్నారు. రూ.వేల కోట్లు మానవ వనరుల అభివృద్ధికి, ఇన్‌ఫ్రా డెవవల్‌మెంట్‌కి ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయి అభివృద్ధికి ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని పేరిట రూ.వేల కోట్ల ఖర్చుతో భవనాలు నిర్మించగా ప్రధానంగా సచివాలయం భవనాలు చూస్తే ప్రతి గోడ బీటలు వారి ఉంటాయనే విషయం ప్రజలకు తెలియదన్నారు. పేదల పిల్లలు నేడు ఇంజనీరింగ్‌, ఎంబీబీఎస్‌, మాస్టర్‌ డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదవి ఉన్నత ఉద్యోగులు సాధిస్తున్నారన్నారు. ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసి మద్దతుగా మాట్లడం లేదని జరిగిన అభివృద్ధి చూసి వాస్తవం చర్చించామని పి.విజయబాబు స్పష్టం చేశారు.

అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి లభిస్తేనే నిజమైన అభివృద్ధి

జగన్‌ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగింది

తప్పుడు సందేశాలు, ప్రచారాలు నమ్మకూడదు.. నిజం తెలుసుకోవాలి

చంద్రబాబు హయాంలో కంటే జగన్‌ పాలనలో అప్పులు తక్కువే

పేదరికం రేషియో కూడా తగ్గింది.. అన్నింటికీ గణాంకాలున్నాయి

భీమవరంలో ఓపెన్‌మైండ్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్‌ నాడు–నేడు’ సెమినార్‌లో మాజీ చీఫ్‌ సెక్రటరీ అజేయ కల్లం

రాష్ట్రం కోసం సర్వస్వం త్యాగం చేశారు

శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం

జగనన్న తప్పక న్యాయం చేస్తారు

పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి వెల్లడి

కుక్కునూరు మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం

చదువుకు అక్కరకు వస్తున్నాయి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు పేద విద్యార్ధుల కుటుంబాలను ఆదుకుంటున్నాయి. ఉన్నత చదువులకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో గాకుండా కళశాల మెనేజేమెంట్‌ ఖాతాలో జమ చేయాలి.

– ఎన్‌.సుస్మిత, బీటెక్‌ విద్యార్థిని, ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల, భీమవరం

పీజీకి కూడా వర్తింపజేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పీజీ కోర్సు కూడా కల్పిస్తే పేద విద్యార్ధులు మరింత ఉన్నత విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అన్ని విద్యాసంస్ధల్లో టెక్నికల్‌, స్కిల్స్‌ కలిగిన సిలబస్‌లను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించడం చాలా మంచి కార్యక్రమం.

– బి.ధరణి, డిగ్రీ విద్యార్థిని, సీఎస్‌ఎన్‌ కళాశాల, భీమవరం

వ్యవసాయం పండగ చేసింది

రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగ చేసింది. స్కూల్స్‌ల్లో ఉచితంగా అందిస్తున్న విద్యామెటీరియల్‌ పేదలకు ఎంతగానో ఉపయోగం. దీనివల్లనే మన విద్యార్ధులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 17 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయం.

– మేడిది జాన్సన్‌, బ్రౌనింగ్‌ జూనియర్‌ కళాశాల సెక్రటరీ, భీమవరం

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

నాడు–నేడు పధకం ద్వారా గ్రామస్ధాయిలో పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం, సోషల్‌ ఇంజనీరింగ్‌పై దృష్టిపెట్టింది. మానవ వనరులపై పెట్టుబడి రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. 40 వేల వైద్యపోస్టులను భర్తీ చేయడం అభినందనీయం. ప్రజల వద్దకే ప్రభుత్వ పధకాల వల్ల లంచాల బాధ లేదు.

– ఎ కృష్ణమోహన్‌, రిటైర్డ్‌ లెక్చరర్‌, భీమవరం డీఎన్నార్‌ కళాశాల

Advertisement
Advertisement