ప్రారంభించారు.. వదిలేశారు! | Sakshi
Sakshi News home page

ప్రారంభించారు.. వదిలేశారు!

Published Thu, May 23 2024 3:15 AM

ప్రార

నిరుపయోగంగా మారిన రూ.2కోట్లతో నిర్మించిన మోడల్‌ మార్కెట్‌ భవనం

నర్సంపేట: నర్సంపేటలోని జిల్లాస్థాయి కూరగాయల మార్కెట్‌, వారాంతపు సంతకు ప్రాధాన్యత ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొనసాగడంతో మార్కెట్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నర్సంపేట పట్టణంలోని అంగడి ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన సమీకృత మోడల్‌ కూరగాయల మార్కెట్‌ భవనాన్ని 2001 మే 28న అప్పటి పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిసరఫరా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ, అప్పటి నుంచి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఈ భవనం ఉన్న అంగడి ఆవరణలోనే కూరగాయల క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. వానాకాలంలో బురదలోనే అమ్మకాలు చేస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదేకాకుండా సమీపంలోనే చిరు వ్యాపారుల కోసం రూ.7.5 లక్షలతో నిర్మించిన రేకుల షెడ్డును కూడా నేటికి కేటాయించకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో ఆదివారం వారాంతపు సంత నర్సంపేట పట్టణ ప్రధాన రహదారిపై నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్లపైనే వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో నర్సంపేట మీదుగా వరంగల్‌, మహబూబాబాద్‌, భద్రాచలం వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో తడుస్తూ ఎండలో ఇబ్బందులుపడుతూ వ్యాపారులతోపాటు వినియోగదారులు మార్కెట్‌ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలోని వర్ధన్నపేట, ఇతర మండల కేంద్రాల్లో కూడా కూరగాయల మార్కెట్ల నిర్వహణపై పట్టింపులేవనే ఆరోపణలు వస్తున్నాయి.

త్వరలోనే వినియోగంలోకి..

నర్సంపేట పట్టణంలోని అంగడి ఆవరణలో నిర్మించిన మోడల్‌ కూరగాయల మార్కెట్‌ను త్వరలోనే వినియోగంలోకి తెస్తాం. ఇప్పటికే రోడ్లపైన కూరగాయలు, ఇతర అమ్మకాలు చేపట్టే వారిని గుర్తించాం. కొంతమేర మరమ్మతు పనులు ఉన్నందన వినియోగంలోకి తేలేకపోయాం.

– బిర్రు శ్రీనివాస్‌,

నర్సంపేట మున్సిపల్‌ కమిషనర్‌

నర్సంపేటలో నిరుపయోగంగా మోడల్‌ మార్కెట్‌

రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన గత ప్రభుత్వం

చిరువ్యాపారులకు కేటాయించని షెడ్డు

అంగడి ఆవరణలోనే కూరగాయల క్రయవిక్రయాలు

వృథాగా టాయిలెట్స్‌..

పట్టణంలోని అంగడి ఆవరణలో మోడల్‌ కూరగాయల మార్కెట్‌ భవనం పక్కన నిర్మించిన టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అంగడి ఆవరణలో కూరగాయలు విక్రయించే వ్యాపారులు, కొనుగోళ్లకు వచ్చే వినియోగదారుల కోసం రూ.15 లక్షలు వెచ్చించి మున్సిపల్‌ అధికారులు సీ్త్ర, పురుషుల కోసం వేర్వేరుగా టాయిలెట్లు నిర్మించారు. నిర్మాణం పూర్తయినా నేటికి ప్రారంభించకపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రారంభించారు.. వదిలేశారు!
1/3

ప్రారంభించారు.. వదిలేశారు!

ప్రారంభించారు.. వదిలేశారు!
2/3

ప్రారంభించారు.. వదిలేశారు!

ప్రారంభించారు.. వదిలేశారు!
3/3

ప్రారంభించారు.. వదిలేశారు!

Advertisement
 
Advertisement
 
Advertisement