అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

Published Wed, May 22 2024 10:45 AM

అగ్ని

నల్లబెల్లి: మండలంలోని గొవిందాపూర్‌ గ్రామంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు ఇంటికి ని ప్పు అంటుకుని బొట్ల సమ్మక్క పూరిల్లు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొట్ల సమ్మక్క కుటుంంబ సభ్యులు రాత్రి ఇంట్లో నిద్రపోయారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండాపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమా రు రూ.2లక్షల వరకు నష్టపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని కోరారు.

ఎండు గంజాయి స్వాధీనం

సంగెం: మండలంలోని ఎల్గూర్‌రంగంపేటలో ఎండు గంజాయిని పట్టుకున్నట్లు వర్ధన్నపేట ఎకై ్సజ్‌ సీఐ స్వరూప తెలిపారు. నర్సానగర్‌ గ్రామపంచాయతీ శివారు జాటోత్‌ తండాకు చెందిన లావుడ్యా వెంకన్న తన ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయిని తరలిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు చేపట్టామన్నారు. వెంకన్న వద్ద పది చిన్న ప్యాకెట్లతో ఉన్న సుమారు వంద గ్రాముల ఎండు గంజాయిని, బైక్‌ను స్వాదీనం చేసుకుని వెంకన్నపై కేసు నమోదు చేసినట్లు సీఐ స్వరూప వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మురళీధర్‌, సరిత, సిబ్బంది పాల్గొన్నారు.

విత్తన ఎంపికలో

జాగ్రత్తలు పాటించాలి

వర్ధన్నపేట: విత్తన ఎంపిక, కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్‌ సూచించారు. మండలంలోని వర్ధన్నపేట, ఇల్లంద, కట్య్రాల, ఉప్పరపల్లి, చెన్నారం, నల్లబెల్లి గ్రామాల్లో విత్తనాల దుకాణాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన ప్రాంతానికి అనువైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని విత్తన డీలర్లకు సూచించారు. విత్తన రకాన్ని ఎంచుకునేందుకు అనుసరించే పద్దతులను రైతులకు వివరించారు. కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుని రైతులు తమ భూములను సారవంతం చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకు రాయితీపై జీలుగలను అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ ప్రాంత ఏఈఓలను సంప్రదించి పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై పొందాలని తెలిపారు.

‘తీన్మార్‌ మల్లన్నను

గెలిపించాలి’

నర్సంపేట: వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుక, నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి తీన్మార్‌ మల్లన్న అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్‌ మల్లన్నను కాంగ్రెస్‌ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇందులో భాగంగా ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఉపఎన్నికలో నర్సంపేట నియోజకవర్గంలోని పట్టభద్రులు అధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్‌, పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
1/3

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
2/3

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
3/3

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

Advertisement
 
Advertisement
 
Advertisement