Sakshi News home page

ప్రతిపక్షాలకు టాటా..బై..బై..!

Published Mon, Apr 15 2024 12:30 AM

- - Sakshi

టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు

పూతికపేట గ్రామం నుంచి 180

కుటుంబాల చేరిక

నెల్లిమర్ల రూరల్‌: జిల్లాలోని ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలన పట్ల ఆకర్షితులై అధికార వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల మండలంలోని పూతికపేట గ్రామంలో టీడీపీ, జనసేన కూటమికి భారీ ఎదురదెబ్బ తగిలింది. ఆ రెండు పార్టీలను వీడి సుమారు 180 కుటుంబాల వారు స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో ఆదివారం చేరారు. గ్రామానికి చెందిన యడ్ల నర్శింగరావు ఆధ్వర్యంలో రెడ్డి పైడిరాజు, శీల సూర్యనారాయణ, యడ్ల రమణ, పైడినాయుడు, పెనుమజ్జి రమణ, తదితర టీడీపీ, జనసేనలకు చెందిన కుటుంబాల వారు మొయిద విజయరామపురం వెళ్లి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పార్టీలో చేరినవారు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తమకు నిష్పక్షపాతంగా సంక్షేమ ఫలాలు అందించారని, ఆయన పాలన నచ్చి పార్టీలో చేరామని చెప్పారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు నెక్కల నాయుడు బాబు, జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు చనమల్లు వెంకటరమణ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

మెరకముడిదాంలో 80 కుటుంబాలు..

మెరకముడిదాం: మండలంలోని గాదెలమర్రివలస, గొట్టుపల్లి గ్రామాలకు చెందిన 65 కుటుంబాల వారు టీడీపీని వీడి జిల్లాపరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ మజ్జిశ్రీనివాసరావు సమక్షంలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరికీ జెడ్పీ చైర్మన్‌ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. గాదెలమర్రివలస నుంచి గొర్లెమోహన్‌రావు, గొర్లెరామునాయుడు, గాదెలరామస్వామి, నడిరెట్లఅప్పలనాయుడు, వలిరెడ్డివెంకటరమణ, యలకలసాంబయ్య, చొక్కనారాయణ, అల్లాడ శ్రీరాములు, ఉయ్యాలసింహాచలం తదితర 50 కుటుంబాల వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మండలంలోని గొట్టుపల్లి గ్రామానికి చెందిన సుంకరిశంకరావు, బైరెడ్డివెంకటేష్‌, బైరెడ్డి రామారావు, సుంకరిచిన్నంనాయుడు, పతివాడసూర్యనారాయణ, సుంకరిగోవింద, మానాపురం గౌరి, గూనాపు అప్పలనాయుడు, అగురురాంబాబు, తాడేలసత్యం, సుంకరిరాములు, సుంకరిపవన్‌ తదితర 15 కుటంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలో చేరినవారంతా రానున్న సాధారణ ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థులైన చీపురుపల్లి ఎమ్మెల్యేగా బొత్ససత్యనారాయణ, విజయనగరం ఎంపీగా బెల్లానచంద్రశేఖర్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఎస్వీ రమణరాజు, తాడ్డివేణుగోపాలరావు, కోట్లవిశ్వశ్వరరావు, కేఎస్‌ఆర్‌ ప్రసాద్‌, బూర్లె నరేష్‌కుమార్‌, గాదెలమర్రివలస సర్పంచ్‌ అట్టాడదేవ, గొట్టుపల్లి సర్పంచ్‌ సుంకరిరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజాంలో 50 కుటుంబాలు..

రాజాం: రాజాం మున్సిపాల్టీ పరిధిలోని బుచ్చింపేట గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబాల వారు వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో ఆదివారం చేరారు. ఈ మేరకు గ్రామానికి చెందిన వారంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తలే రాజేష్‌ సమక్షంలో పార్టీలో చేరి కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కోన లక్ష్మణ, కోన పోలయ్య, కోన సూరి, కోన రాము, కోన సీతయ్య, ఎర్ర రాము, ఎర్ర సూరి, ఎర్ర గుర్రయ్య, ఎర్ర ప్రసాద్‌, ఎర్ర కొండపరై సురేష్‌, దుగ్గు రాము, దుర్రబార శేఖర్‌, రామరమణ, బూర్లి గణశేఖర్‌, బూర్లి రాము, డొక్కర రమేష్‌, డొక్కర సురేష్‌, డొక్కర తిరుపతి, పిట్టా అప్పన్న, బోర గోవింద, దుక్క శంకర్‌, డొప్ప తిరుపతి, ఎర్ర ప్రసాద్‌, ఎం.రాము, డొక్కర రమేష్‌, రాము, పిలక అసిరినాయుడు, గుణుపూరు అప్పన్న, గంగయ్య, పాము చిన్న, పిట్ట అప్పన్న, సీనయ్య, శ్రీరాము, బోర లోకేష్‌, శేఖర్‌, దిలీప్‌, కోన గణేష్‌, గోవింద, రాము, డొప్ప అప్పన్న తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోందని, వైఎస్సార్‌సీపీ ద్వారానే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతోందని వెల్లడించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా డాక్టర్‌ రాజేష్‌ను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్‌లను గెలిపించి, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజాం పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు, జేసీఎస్‌ కన్వీనర్‌ పాలవలస గోపి, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేతలు పిట్టా జగదీష్‌, నమ్మి పార్వతీరావు, ముద్దాడ అప్పన్న, కోరాడ రామినాయుడు, బట్టికాళ రాము, నమ్మి రాము, నమ్మి అప్పన్న, పిట్ట సూరి, ఆంబాన తమ్మయ్య, నమ్మి సత్యనారాయణ, పిట్టా శంకర్‌, నమ్మి అసిరినాయుడు, కోరాడ రాము, గ్రామానికి చెందిన యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

పార్వతీపురంలో 50 కుటుంబాలు..

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం పురపాలక సంఘం పరిధి 23వ వార్డులో టీడీపీ, జనసేనలకు చెందిన 50 కుటుంబాల వారు ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో ఆదివారం చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే జోగారావు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించి..సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాని పిలుపునిచ్చారు. తామంతా టీడీపీలో దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ తమకు మేలు జరగలేదని, ఏదైనా మేలు జరిగిందంటే కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలోనేనని, భవిష్యత్తులో మరింత మేలు జరుగుతుందన్న అధికార పార్టీలో చేరామని వారంతా చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణఽ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్‌లీడర్‌ మంత్రి రవి కుమార్‌, స్థానిక కౌన్సిలర్‌ మంత్రి ఉమామహేశ్వరి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement