పెయింటర్‌కు గాయాలు

రిజిస్ట్రార్‌ సుజాతకు వినతిపత్రం అందజేస్తున్న దళిత సంఘాల నాయకులు   - Sakshi

టెక్కలి రూరల్‌ : టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని సత్యసాయి నగర్‌లో ఇటీవల నిర్మాణం చేపట్టిన నాలుగు అంతస్తుల బిల్డింగ్‌కు రంగులు వేస్తుండగా పరంజీ విరిగిపోవడందో టెక్కలి ఆదిఆంధ్ర వీధికి చెందిన కిర్రి జగన్నాథం కిందపడి గాయాలపాలయ్యాడు. తలకు బలమైన గాయం తగలడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.

కమిటీ నివేదికలు బయటపెట్టాలి

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో పూర్వపు వీసీ నిమ్మ వెంకటరావు అక్రమ నియామకాలు, ఇతర అంశాలపై ఏర్పాటు చేసిన మూడు కమిటీలు నివేదికలు బయట పెట్టాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు బుధవారం వర్సిటీ పరిపాలన కార్యాలయంలో రిజిస్ట్రార్‌ పి.సుజాతకు వినతి పత్రం అందజేశారు. కమిటీ నివేదికలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన 34 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఎందుకు తొలగించడం లేదన్నారు. నెల రోజుల్లో కమిటీ నివేదికల ఆధారంగా చర్యలు ప్రారంభించకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రార్‌ను కలిసిన వారిలో దళిత సంఘాలు నాయకులు మిస్కా కృష్ణయ్య, దుర్గాసి గణేష్‌, టొంపాల రమణ ఉన్నారు.

Election 2024

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top