నాచగిరి వ్రతశోభితం | Sakshi
Sakshi News home page

నాచగిరి వ్రతశోభితం

Published Sun, Apr 14 2024 7:55 AM

నాచగిరిలో వ్రతమాచరిస్తున్న భక్తులు - Sakshi

● కిటకిటలాడిన పుణ్యక్షేత్రం

వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి శనివారం సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలతో అలరారింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. హరిద్రానదిలో పుణ్యస్నానాలాచరించారు. వ్రతమండపం చేరుకుని భక్తిశ్రద్ధలతో వ్రతమాచరించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో కొలువైన లక్ష్మీనృసింహులను దర్శించుకుని తరించారు. ఆలయ ఈఓ అన్నపూర్ణ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఇబ్బందికలగకుండా పర్యవేక్షించారు. క్షేత్రంలో 33 సత్యనారాయణవ్రతాలు, 11 నిజాభిషేకాలు, 25 సేవలు జరిగాయని ఈఓ పేర్కొన్నారు.

Advertisement
Advertisement