12 స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు | Sakshi
Sakshi News home page

12 స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు

Published Tue, May 14 2024 3:25 PM

-

మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట(అందోల్‌): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 12 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్‌లోని 196 పోలింగ్‌ కేంద్రంలో తన కూతురు త్రిషతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని జహీరాబాద్‌, మెదక్‌ పార్లమెంట్‌ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని, ప్రజలు దేశంలో కూడా ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తర్వాతి స్థానం కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పోటీ పడుతున్నాయన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ జి.మల్లయ్య, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement