విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం | Sakshi
Sakshi News home page

విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం

Published Sat, Apr 20 2024 1:25 AM

మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌  - Sakshi

సిరిసిల్లక్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ అఖిల్‌మహాజన్‌ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో నేరవిచారణ సమర్థంగా చేపట్టాలని సూచించారు. పెండింగ్‌ కేసులపై దృష్టి పెట్టి పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిస్సింగ్‌కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతీ రోజు వాహనాల తనిఖీలు చేపట్టాలని, గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్‌ నేరాలు, మహిళా చట్టలు, గంజాయితో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయితీలు చేస్తామంటూ మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని, డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిత్యం చేపట్టాలని సూచించారు.

పటిష్ట ప్రణాళికతో పార్లమెంట్‌ ఎన్నికలు

ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగేలా అందరూ కలిసి పనిచేయాలని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఉంచి, బైండోవర్‌ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించి ప్రజలకు భద్రతభావం కల్గించాలని పేర్కొన్నారు. ట్రెయినీ ఐపీఎస్‌ రాహుల్‌రెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, నాగేంద్రచారి, మురళీకృష్ణ, సర్వర్‌, సీఐలు, ఎస్సైలు, ఐటీకోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు

అక్రమార్కులను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ నిఘా

Advertisement
Advertisement