సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్లు పరిశీలన | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్లు పరిశీలన

Published Wed, Nov 22 2023 12:12 AM

సిరిసిల్ల పీఎస్‌నగర్‌ యూహెచ్‌సీలో  ఆరోగ్య మహిళ కార్యక్రమం - Sakshi

వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ 26న వేములవాడకు రానున్నారు. ఈసందర్భంగా నిర్వహించే బహిరంగసభ స్థలిని మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అంనతరం ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఓటర్లను కోరేందుకు సీఎం రానున్నట్లు తెలిపారు. బాలానగర్‌ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో బహిరంగ సభా ప్రాంగణంతో పాటు హెలిప్యాడ్‌, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవరెడ్డి, బండ నర్సయ్య, రాజు, మారం కుమార్‌, యాచమనేని శ్రీనివాసరావు, రాము, తిరుపతి, జోగిన్‌పల్లి అజిత్‌రావు, దూలం సంపత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ఆరోగ్య మహిళ’కు స్పందన

సిరిసిల్లటౌన్‌: జిల్లాలో ఆరోగ్యమహిళ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు ప్రకటనలో తెలిపారు. సిరిసిల్లలోని పీఎస్‌నగర్‌, వేములవాడ పీఏసీ, నేరెళ్ల పీహెచ్‌సీ, తంగళ్లపల్లి పీహెచ్‌సీల్లో మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ హెల్త్‌సెంటర్లలో నిర్వహించిన ఆరోగ్య మహిళ శిబిరాల్లో ఓపీడీ 617, బ్రెస్ట్‌ 617, ఓరల్‌ కావిటీ 617 పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. ఇవి కాకుండా యూటీఐ 18, ల్యాబ్‌ 82, థైరాయిడ్‌ 60, విటమిన్‌ డీ 46, సీబీపీ 89, సూక్ష్మ పోషకాలు 63 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా వీరిలో 17 మంది పేషెంట్లను జిల్లాసుపత్రికి రెఫర్‌ చేసినట్లు వివరించారు. ఆయా ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలను సందర్శించిన డీఈవో

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాధికారి ఎ.రమేశ్‌కుమార్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా తాడూర్‌, గోపాల్‌రావుపల్లె పాఠశాలల విద్యార్థులతో మాట్లా డారు. పలు సందేహాలను నివృత్తి చేస్తూ సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎస్‌వో కె.వెంకన్న, ప్రధానోపాయులు బూర రవీందర్‌, చందనపు రవీందర్‌, ఉపాధ్యాయులు విష్ణుప్రసాద్‌రావు, అపర్ణ, భాస్కర్‌, చంద్రమౌళి, రమేశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

26న మహిళా కబడ్డీ సెలక్షన్స్‌ ట్రయల్స్‌

సిరిసిల్లటౌన్‌: వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు క్రీడాకారుల సెలక్షన్స్‌ ట్రయల్స్‌ను ఈనెల 26న సిరిసిల్లలో నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సింగారపు తిరుపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెలక్షన్స్‌ ట్రయల్స్‌ జిల్లా కేంద్రంలోని పత్తిపాక వీధిలో సిద్దార్థ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతాయని వివరించారు. ఈసందర్భంగా సెలక్షన్స్‌ ట్రయల్స్‌లో పాల్గొనే క్రీడాకారులు 75 కేజీలలోపు బరువు ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మదన్‌ పీఈటీని 99595 25384 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

సభాస్థలిని పరిశీలిస్తున్న   వినోద్‌కుమార్‌, నాయకులు
1/2

సభాస్థలిని పరిశీలిస్తున్న వినోద్‌కుమార్‌, నాయకులు

విద్యార్థులకు సూచనలిస్తున్న డీఈవో  రమేశ్‌కుమార్‌
2/2

విద్యార్థులకు సూచనలిస్తున్న డీఈవో రమేశ్‌కుమార్‌

Advertisement
Advertisement