పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌పై వివాదం | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌పై వివాదం

Published Wed, Nov 22 2023 12:12 AM

 మల్యాలలో ఎన్నికల అధికారులు  - Sakshi

చందుర్తి(వేములవాడ): మండలంలోని మల్యాలలో మంగళవారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌పై ఎన్నికల అధికారులు, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ నాయకులకు సమాచారం లేదో ఏమోగానీ అనుకున్న సమయంలో పోలింగ్‌ ఏజెంట్‌ పాసులు తీసుకోలేకపోయారు. దీంతో వారిని పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ వద్దకు వచ్చేందుకు ఎన్నికల అధికారులు నిరాకరించారు. గ్రామానికి చెందిన చింతం మల్లేశం అనే దివ్యాంగుడు ఓటు వేసే సమయంలో అతడి భార్య అందుబాటులో లేకపోవడంతో అతడి చిన్మమ్మతో ఓటు వేయించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. అందుకు మల్లేశం నిరాకరించి కాంగ్రెస్‌కు చెందిన సంటి ప్ర సాద్‌ను పంపించాలని కోరాడు. ప్రసాద్‌ సహాయంతో ఓటు వేశాడు. దీంతో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ యువజన విభాగం నియోజకవర్గ నాయకుడు ఈర్లపెల్లి రాజు కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయిస్తున్నారంటూ ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలో మల్లేశం సూచించిన వ్యక్తితో ఓటు వేయించామని బదులిచ్చి అక్కడి నుంచి అధికారులు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని రాజు పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ విషయమై సెక్టార్‌ అధికారి రవీందర్‌ను వివరణ కోరగా.. వివా దం ఏమీ జరగలేదని చెప్పారు. కాగా మండలంలోని మల్యాలలో 18 మంది, సనుగులలో 12, లింగంపేటలో ఆరుగురు పోస్టల్‌ బ్యాటెల్‌ పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌

సనుగులలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ను వినియోగించుకుంటున్న దివ్యాంగుడు
1/1

సనుగులలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ను వినియోగించుకుంటున్న దివ్యాంగుడు

Advertisement
Advertisement