అత్యంత రక్షణగా.. | Sakshi
Sakshi News home page

అత్యంత రక్షణగా..

Published Thu, Apr 18 2024 2:30 PM

అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ ప్రారంభోత్సవంలో బాలినేని (ఫైల్‌) - Sakshi

ఈ భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ పనులు అత్యంత రక్షణగా చేపట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ నిర్మాణ పనుల్లో జర్మనీకి చెందిన విదేశీ విద్యుత్‌ వాహక పరకరాలను వాడారు. భూమిలో దాదాపు 1.8 మీటర్ల లోతులో విద్యుత్‌ కేబుల్‌ను వివిధ రకాల పొరల ద్వారా ఏర్పాటు చేశారు. ఆ పొరలు ఇసుక, సిమెంట్‌ కాంక్రీట్‌, ప్లాస్టిక్‌ టేపుల్లాంటి పొరల రక్షణలో విద్యుత్‌ కేబుల్‌ నిర్మాణ పనులు నిర్వహించారు. తొలుత కింద 4 అంగుళాల మందంలో ఇసుక నింపారు. ఇసుకపైన 3.5 అంగుళాల మందంలో ఉన్న విద్యుత్‌ కేబుళ్లను అమర్చారు. ఆ తరువాత 10 అంగుళాల మందంలో ఇసుక పొర ఏర్పాటు చేశారు. ఆ ఇసుకపై కాంక్రీట్‌తో కూడిన సిమెంట్‌ స్లాబులు అమరుస్తారు. ఆ సిమెంట్‌ స్లాబులపై 30 సెంటీ మీటర్ల మేర మట్టి పోసి బలీయం చేశారు. ఆ తరువాత మట్టిపై కింద ఉన్న కేబుల్‌కు రక్షణగా జియో గ్రిడ్‌తో కూడిన టేపును పరిచారు. ఆ తరువాత మట్టిని నింపి రోలింగ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement