బత్తిలి పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

బత్తిలి పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

Published Tue, Dec 5 2023 4:58 AM

- - Sakshi

భామిని: మండలంలోని బత్తిలిలో నూతనంగా నిర్మించిన మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి,గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌,డీఎస్పీ కేవీ కృష్ణారావులు నూతన భవనంలోని నిర్మాణాలు, గదులను డిప్యూటీ సీఎం రాజన్నదొరకు చూపించి వివరించారు. ముందుగా సాయుధ దళాలు డిప్యూటీ సీఎంకు పోలీస్‌ వందనం సమర్పించాయి. కార్యక్రమంలో పాలకొండ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ బాబు, సీఐ కె.మురళీధర్‌, ఎస్సై యతిరాజుల అమ్మానరావు, బత్తిలి సర్పంచ్‌ టింగ శాంతికుమారి, ఎంపీటీసీ టింగ అన్నాజీరావు, కోఆప్షన్‌ సభ్యుడు విశ్వనాథ పట్నాయక్‌, ఉపసర్పంచ్‌ వమ్మరవిల్లి రమేష్‌, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తోట సింహాచలం, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మజ్జి మోహనబాబు, బోదెపు శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement