కొంటామల్‌లో రీపోలింగ్‌ | Sakshi
Sakshi News home page

కొంటామల్‌లో రీపోలింగ్‌

Published Thu, May 23 2024 3:35 AM

-

భువనేశ్వర్‌: కంధమల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కొంటామల్‌ ప్రాంతంలో రీపోలింగ్‌ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. ఈ నెల 23న కొంటామల్‌ బూత్‌ నంబర్‌ 26, 28లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఓటింగ్‌ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లు, అభ్యర్థులకు దీనిపై అవగాహన కల్పించాలని బౌధ్‌, కంధమల్‌ జిల్లాల కలెక్టర్లను భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. దిలీప్‌కుమార్‌ మహపాత్రోను బౌధ్‌ అదనపు కలెక్టర్‌గా, కొంటామల్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిగా కమిషన్‌ నియమించింది. కొంటామల్‌ నియోజకవర్గంలో బూత్‌ రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపణలు రావడంతో భారత ఎన్నికల సంఘం అనుమతితో బౌద్‌ జిల్లాలోని కొంటామల్‌ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని రెండు పోలింగ్‌ బూత్‌లు 26 – కిరాసిరా, 28 – మహేశ్వరపిండ్‌లలో ఈ నెల 23న రీ–పోలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఈ విషయమై రాజకీయ అభ్యర్థులు, ఏజెంట్లందరికీ లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తగిన ప్రచారం చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి జిల్లా ఎన్నికల అధికారికి సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement