ఠాణాకలాన్‌ గోదాం పరిశీలన | Sakshi
Sakshi News home page

ఠాణాకలాన్‌ గోదాం పరిశీలన

Published Fri, Dec 22 2023 12:58 AM

గోదాంను పరిశీలిస్తున్న డీపీఎం సంజీవ్‌కుమార్‌ - Sakshi

జీపీకి తాళాల అప్పగింత

ఎడపల్లి(బోధన్‌): ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌లోని రూర్బ న్‌ నిధులతో చేపట్టిన 500 మెట్రిక్‌ టన్నుల గోదాంను డీఆర్‌డీవో డీపీఎం సంజీవ్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన ‘మాజీ ప్రజాప్రతినిధి కక్కుర్తి’ వార్తకు జిల్లా అధికారులు స్పందించి గోదాంను పరిశీలించారు. అనంతరం డీపీఎం ఓంకార్‌ గోదాం తాళాలను పంచాయతీ అధికారులకు అందించారు. గోదాంకు వచ్చిన ఆదాయాన్ని ప్రత్యేకంగా రశీదులు ఏర్పాటు చేసి వాటి కిరాయి వివరాలను అందులో పొందుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపాలకృష్ణ, ఏపీవో ఓంపాల్‌, ఏపీఎం శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

రెండున్నరేళ్ల అద్దైపె స్పష్టత కరువు

మాజీ ప్రజాప్రతినిధి గోదాంను రెండున్నరేళ్లు విని యోగించుకోగా.. కిరాయి వసూలుపై స్పష్టత రాలే దు. దీంతో అద్దె వసూలు చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు నోటీ సులిచ్చి వసూలు చేసే అధికారులు మాజీ ప్రజాప్రతినిధిపై ఉదాసీనతంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. అధికారులు స్పందించి కిరాయి వసూలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

1/1

Advertisement
Advertisement