No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, Apr 17 2024 1:45 AM

-

నేరస్తులకు శిక్ష పడేలా ఇన్వెస్టిగేషన్‌ ఉండాలి

ఆదిలాబాద్‌టౌన్‌: నేరస్తులకు కచ్చితంగా శిక్షలు పడే విధంగా పరిశోధన నిర్వర్తించాలని ఎస్పీ గౌస్‌ ఆలం అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టంతో పరిశోధనలు, కోర్టులో చార్జిషీటు దాఖలు చేయడం, నేరస్తులను పట్టుకునే క్రమంలో అనుసరించాల్సిన విధానాలు తదితర అంశాలపై ఇన్వెస్టిగేషన్‌ అధికారులకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శిక్షణతో పాటు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, కల్తీకల్లు తదితర మత్తు పదార్థాలు సేవించడం వల్ల జీవితాలు నాశనమవుతాయన్నారు. పదేపదే నేరం చేసే వారిపై ప్రత్యేక కార్యాచరణ ద్వారా శిక్షలు కఠినంగా విధించేలా చార్జిషీట్‌ దాఖలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ కే.సురేందర్‌ రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement