Sakshi News home page

డిగ్రీ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు వాయిదా

Published Sat, Nov 11 2023 1:36 AM

-

బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు కూడా..

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఈనెల 13న నిర్వహించాల్సిన డిగ్రీ బ్యాక్‌లాగ్‌ పరీక్షల్ని వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి శుక్రవారం తెలిపారు. ఈనెల 13న దీపావళి సెలవుదినంగా ప్రకటించిన సందర్భంగా అదే రోజున జరగాల్సిన ఆయా పరీక్షలను వాయిదా వేసినట్లు, మళ్లీ ఈనెల 15న నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాల్ని సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు. కేయూ పరిధి బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు కూడా ఈ నెల 13న జరగాల్సినవి వాయిదా వేశామని అదన పు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు. మ ళ్లీ ఆయా పరీక్షలు ఈనెల 15న నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా.. ఈనెల 13న దీపావళి సెలవుది నంగా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement