RRR Movie Promotion Tour Details In Telugu - Sakshi
Sakshi News home page

RRR Movie: జక్కన్న భారీ ప్లాన్‌.. 6 రోజులు, 9 నగరాలు

Published Thu, Mar 17 2022 6:32 PM

RRR Movie Promotion Tour Details - Sakshi

RRR Movie Promotions Plan: సినిమాను తెరకెక్కించడంలోనే కాదు.. ప్రమోషన్‌ స్ట్రాటజీలో కూడా ఎక్స్‌పర్ట్‌ రాజమౌళి. ఆయన మూవీ ప్రమోషన్స్‌ ప్లానింగ్‌  ఎలా ఉంటుందో ‘బాహుబలి’తో ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ‘అంతకు మించి..’అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు జక్కన్న. పాన్‌ ఇండియా చిత్రం కావడంతో.. దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నాడు.

సినిమా విడుదల(మార్చి 25)కి ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో.. ప్రమోషస్స్‌లో స్పీడ్‌ పెంచాడు ఈ దర్శకధీరుడు. 6 రోజుల్లో 9 నగరాలను చుట్టిరావాలని ప్లాన్‌ వేశాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఏ నగరాల్లో, ఎప్పుడెప్పుడు ఈవెంట్స్‌ నిర్వహించబోతున్నారలో తెలియజేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. మార్చి 18న దుబాయ్‌; 19న బెంగళూరు, 20న బరోడా, ఢిల్లీ; 21న అమృత్‌సర్‌, జైపూర్‌; 22న కోల్‌కతా, వారణాసి; 23న హైదరాబాద్‌లో ప్రమోషన్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికొస్తే.. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా మూవీలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.

Advertisement
Advertisement