26న ప్రధాని నరేంద్రమోదీ రాక? | Sakshi
Sakshi News home page

26న ప్రధాని నరేంద్రమోదీ రాక?

Published Tue, Nov 21 2023 4:40 AM

పట్టుబడిన నగదును చూపుతున్న పోలీసులు  - Sakshi

తూప్రాన్‌: తూప్రాన్‌లో ఈ నెల 26న నిర్వహించే సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ మల్లారెడ్డి తెలిపారు. స్తానిక టాటా కాఫీ పరిశ్రమ సమీపంలోని ఖాళీ స్థలాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతం అందరికీ అనువుగా ఉంటుందని భావిస్తున్నామని, అయితే త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. స్థలాన్ని పరిశీలించి హైకమాండ్‌కు తెలియజేస్తామన్నారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసు, నాయకులు మధుసూదన్‌రెడ్డి, యాదగిరి ఉన్నారు.

రూ.25 లక్షలు పట్టివేత

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ఎన్నికల నిబంధనావళిలో భాగంగా మనోహరాబాద్‌ మండలం కాళ్ళకల్‌ వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో రూ.25 లక్షలు పట్టుబడ్డాయని ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట్‌ మండల కేంద్రానికి చెందిన కల్వకుంట్ల నరేందర్‌రావు హైదరాబాద్‌ నుంచి కామారెడ్డికి బస్సులో వెళ్లూ తనవెంట రూ.25 లక్షల నగ దును తీసుకెళుతున్నారు. అతని వద్ద నుంచి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు నగదును సీజ్‌ చేశారు. ఆ డబ్బును గజ్వేల్‌ ఆర్వోకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

చిరుత దాడిలో

లేగదూడ హతం

రామాయంపేట(మెదక్‌): మండలంలోని ఝాన్సిలింగాపూర్‌ గ్రామశివారులో చిరుత దాడిచేయడంతో లేగదూడ మృతి చెందింది. గ్రామానికి చెందిన నర్సగల్ల భూదయ్య తన పశువులను అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పంటచేనువద్ద ఉంచుతాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం ఆయన పొలంవద్దకు వెళ్లగా దూడ మృతిచెంది ఉండడాన్ని గమనించాడు. చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయని బాధిత రైతు పేర్కొన్నాడు.

ఉపాధ్యాయులు

సమయపాలన పాటించాలి

మనోహరాబాద్‌(తూప్రాన్‌): విద్యార్థులు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, ప్రార్థన సమయం కంటే ముందే పాఠశాలకు హాజరు కావాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ ఆదేశించారు. సోమవారం మనోహరాబాద్‌ మండలం కాళ్ళకల్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పాటు ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పలు రికారులను పరిశీలించి, పదో తరగతి విద్యార్థులకు భౌతిక, గణిత శాస్త్రాలలో పలు ప్రశ్నలు అడిగారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట హెచ్‌ఎంలు వెంకటస్వామి, మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు.

మత్స్యకారుల వలలో

భారీ కొండచిలువ

కొల్చారం(నర్సాపూర్‌): కొంగోడు గ్రామ శివారు పెద్ద చెరువులో సోమవారం చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు వలలో భారీ కొండచిలువ చిక్కింది. అది ఆరున్నర అడుగుల పొడవు, 12 కిలోల బరువు ఉందని మత్స్యకారులు తెలిపారు. అయితే భయపడి దానిని చంపేసినట్లు తెలిసింది.

స్థలాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు
1/4

స్థలాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు

పాఠశాలలో విద్యార్థులను
ప్రశ్నలడుగుతున్న డీఈఓ రాధాకిషన్‌
2/4

పాఠశాలలో విద్యార్థులను ప్రశ్నలడుగుతున్న డీఈఓ రాధాకిషన్‌

వలలో చిక్కిన కొండచిలువ
3/4

వలలో చిక్కిన కొండచిలువ

4/4

Advertisement
Advertisement