బీభత్సం.. | Sakshi
Sakshi News home page

బీభత్సం..

Published Sat, May 25 2024 12:55 PM

బీభత్

ఈదురుగాలుల

క్కసారిగా వాతావరణం చల్లబడి కురిసిన భారీ వర్షంతో ఉపశమనం పొందిన ప్రజలు.. అదే సమయంలో వీచిన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడి ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి నిప్పులు కక్కిన భానుడు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాకేంద్రంతోపాటు మూసాపేట, బాలానగర్‌, మహబూబ్‌నగర్‌ అర్బన్‌, నవాబ్‌పేట, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాకేంద్రంలో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇదే సమయంలో గాలి దుమారం రేగడంతో తెలంగాణ చౌరస్తా సమీపంలో చెట్టు, విద్యుత్‌ స్తంభం విరిగిపడి అటు వైపు వాహనాల రాకపోకలకు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. అలాగే నవాబ్‌పేటలో శుక్రవారం తూకాలు చేస్తున్న సమయంలో అకాల వర్షం కురవడంతో సుమారు 23 వేలకు పైగా బస్తాల ధాన్యం తడిసిపోయింది. కారూర్‌లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కిషన్‌గూడలో రేకులు గాలికి ఎగిరిపోగా ప్లాట్ల స్థలాలకు వేసుకున్న ప్రహరీ కూలిపోయింది. మూసాపేటలో రోడ్డు పక్కన ఉన్న భారీ వేప చెట్టు విరిగిపోయింది. రోడ్డు వైపు పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే వేముల

స్టేజీ వద్ద హనుమాన్‌ విగ్రహం వద్ద కూడా పెద్ద చెట్టు నేలకొరిగింది. ఈదురు గాలుల ఉధృతికి జాతీయ రహదారిపై వాహనదారులు రోడ్డు పక్కన తమ వాహనాలను కొద్దిసేపు నిలుపుకొని తర్వాత వెళ్లిపోయారు. అడ్డాకుల మండలంలో పెద్దఎత్తున ఈదురు గాలులు రాగా స్వల్పంగా వర్షం కురిసింది. బాలానగర్‌ మండలంలోని వాయిల్‌కుంట తండాలో సభావత్‌ దేవ్య ఇంటిపై ఉన్న రేకులకప్పు ఎగిరిపోయి నిరాశ్రయులయ్యారు.

విరిగిపడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు

అంతరాయం

నవాబ్‌పేటలో తడిసిన వరిధాన్యం

చల్లబడిన వాతావరణం..

ఉక్కపోత నుంచి ఉపశమనం

– మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం)/ అడ్డాకుల/ బాలానగర్‌/ నవాబ్‌పేట

బీభత్సం..
1/5

బీభత్సం..

బీభత్సం..
2/5

బీభత్సం..

బీభత్సం..
3/5

బీభత్సం..

బీభత్సం..
4/5

బీభత్సం..

బీభత్సం..
5/5

బీభత్సం..

Advertisement
 
Advertisement
 
Advertisement