అవినీతి.. చేతివాటం.. మోసాలు | Sakshi
Sakshi News home page

అవినీతి.. చేతివాటం.. మోసాలు

Published Fri, May 24 2024 7:40 AM

-

బదిలీల ప్రక్రియ చేపట్టకపోవడంతో చాలా ఆలయాల్లో ఉద్యోగులు అవినీతి, చేతివాటం, మోసాలకు పాల్పడిన ఘటనలున్నాయి. తమను కదిలించే నాథుడే లేడంటూ కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. కొందరు ఉద్యోగులు ఆలయాల భూములను బహిరంగ వేలంలో కౌలుకు ఇవ్వకుండా గుట్టుచప్పుడు తమ అనుచరులకు ఇచ్చుకున్నారు. ఈ విషయం పత్రికల్లో వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. రికార్డుల్లో దొంగ లెక్కలు, టికెట్లు, రశీదు పుస్తకాలు సొంతంగా ప్రింట్‌ చేయించుకొని అవినీతికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలకు సంబంధించి రశీదులు సైతం ఇవ్వడం లేదు. హుండీలోని మిశ్రమ బంగారు, అలాగే ఆలయంలోని బంగారు, వెండి ఆభరణాలకు ఇన్సూరెన్స్‌ చేయించడం లేదు. ఓ ప్రముఖ ఆలయంలోని ఓ ఉద్యోగి ఏకంగా హైందవ భక్తురాలిని ఇతర వర్గానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేసేందుకు గట్టి ప్రయత్నం చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆలయ అధికారులు, వీహెచ్‌పీ, హైందవ సంఘాలను ఆశ్రయించడంతో వారు వచ్చి దేవదాయశాఖ ఉన్నతాధికారులను నిలదీయడంతో సదరు ఉద్యోగిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసి తిరిగి ఇదే జిల్లాలోని మరో ఆలయానికి డిప్యూటేషన్‌పై పంపించారు. ఇలా చెబుతూపోతే అనేక అవినీతి, మోసాలు జరిగాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement