ఓటును స్వేచ్ఛగావినియోగించుకోండి | Sakshi
Sakshi News home page

ఓటును స్వేచ్ఛగావినియోగించుకోండి

Published Thu, Nov 16 2023 1:30 AM

- - Sakshi

గండేడ్‌: ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌ సూచించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు వెన్నాచేడ్‌, సల్కర్‌పేట్‌లో మహమ్మదాబాద్‌ ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలో పారా మిలటరీ దళాలు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ఆయా గ్రామాల్లోని ఓటర్లలో ధైర్యం నింపారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అడిషనల్‌ ఎస్పీ సూచించారు.

నేడు ఇథనాల్‌ బాధిత గ్రామాల సందర్శన

పాలమూరు: రెండేళ్లుగా చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయని, సెప్టెంబర్‌ 22న జరిగిన దాడిపై గ్రామాల పరిస్థితి తెలుసుకోవడానికి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆధ్వర్యంలో గురువారం బాధిత గ్రామాలను సందర్శిస్తార ని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవాచారి ఒక ప్రకటనలో తెలిపా రు. సెప్టెంబర్‌ 22న జరిగిన ఘటనలో అనేక మంది రైతులు, కూలీలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని, కొందరు బెయిల్‌పై బయటకు వస్తే మరికొందరు జైలులో ఉన్నారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హరగోపాల్‌తో పాటు శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయం విద్యార్థులు, రచయితలు చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీ బాధితులను కలుస్తారని తెలిపారు.

కనీస పెన్షన్‌ పెంపుదల కోసం ఆందోళనలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఈపీఎస్‌ పెన్షనర్ల కనీస పెన్షన్‌ పెంపుదల కోసం ఆందోళనల్లో భాగంగా డిసెంబర్‌ 7న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. జిల్లాకేంద్రం పారిశ్రామికవాడలోని సీనియర్‌ సిటిజన్‌ ఫోరం కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ, ప్రభుత్వ రంగసంస్థల ఈపీఎస్‌ పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజసింహుడు మాట్లాడుతూ హయ్యర్‌ పెన్షన్‌ పెంపుదలపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహించడం తగదన్నారు. కనీస పెన్షన్‌ పెంపుదల కోసం తమసమితికి హామీ ఇచ్చి ఒక నిర్ణయానికి రాకపోవడం శోచనీయమన్నారు. కనీస పెన్షన్‌ పెంపుదల కోసం ఇక ఉపేంక్షించేది లేదని, ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఈనెల 20న హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన భవన్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు జిల్లాలోని ఆర్టీసీ, ఈపీఎస్‌ పెన్షనర్లు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అబ్దుల్‌ కరీం, భగవంతు, నారాయణ, ఉమేష్‌ కుమార్‌, మోహన్‌రెడ్డి, బస్వరాజ్‌, అనంతరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement