వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

Published Tue, May 21 2024 8:20 AM

వేర్వ

కొడకండ్ల : మాయదారి మృత్యువు మాటు వేసి కాటు వేసింది. కర్రీ తెచ్చుకునేందుకు వె ళ్లిన అన్నదమ్ములను కారు రూపంలో అ మాంతం బలితీసుకుంది. ఈ ప్రమాదం హై దరాబాద్‌లో జరగగా.. కొడకండ్ల మండలం రామవరంలో విషాదం నెలకొంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు, రాజేశ్వరి దంపతులకు ము గ్గురు కుమారులు. పెద్ద కుమారుడి కి వివాహమై కూకట్‌పల్లిలో నివా సం ఉంటున్నాడు. రెండో కుమారుడు శ్రావణ్‌ బీటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ పీర్జాదిగూడలో నివాసం ఉంటుండగా చిన్నకుమారుడు శివ ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్‌ ఎంజీఎంలో పనిచేస్తూ ఆదివారం అన్న శ్రావణ్‌ నివాసముంటున్న పీర్జాదిగూడకు వెళ్లాడు. రాత్రి పది గంటల సమయంలో కర్రీ తెచ్చుకునేందుకు ఇద్దరు బైక్‌పై వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కారు.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందగా శ్రావణ్‌ ను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. కాగా, ఎదిగిన ఇద్దరు కొడుకులు రో డ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి దండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోస్టుమార్టం అనంత రం మృతదేహాలను సోమవారం గ్రామానికి తీసుకురాగా కడసారి చూసేందుకు వచ్చిన గ్రామస్తులు బోరున విలపించారు.

మేడిపల్లిలో మరొకరు..

కాటారం: కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి కృష్ణకాలనీకి చెందిన కోదాది శ్యామ్‌కుమార్‌(30) తన స్నేహితుడు ఠాకూర్‌ పృథ్వీతో కలిసి ద్విచక్రవాహనంపై మరో స్నేహితుడిని దింపడానికి మండలంలోని బయ్యారం వచ్చారు. తిరుగు ప్రయాణంలో పృథ్వీ బైక్‌ నడుపుతుండగా శ్యామ్‌కుమార్‌ వెనుక కూర్చున్నాడు. మేడిపల్లి అటవీ ప్రాంతంలో బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో శ్యామ్‌కుమార్‌ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ సమయంలో భూపాలపల్లి నుంచి కాటారం వైపునకు వెళ్తున్న ఏపీ 36టీబీ 4672 నంబర్‌ గల తుఫాన్‌ వాహనం శ్యామ్‌కుమార్‌ను గమనించక అతడి పైనుంచి వెళ్లింది. దీంతో శ్యామ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పృథ్వీకి గాయాలు కావడంతో భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య దివ్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శివదర్శనం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్‌ తెలిపారు.

అన్నాసాగరంలో రిటైర్డ్‌ ఉద్యోగి..

హసన్‌పర్తి: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ రిటైర్డ్‌ ఉ ద్యోగి మృతి చెందాడు. హసన్‌పర్తి మండలం అన్నాసాగరం బీసీ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అన్నాసాగరానికి చెందిన గడ్డం కొమురయ్య(70) రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి. ప్రస్తుతం కాజీపేట డీజిల్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సోమవారం వ్యక్తిగత పని నిమిత్తం అదే ప్రాంతంలో ఉంటున్న తన సోదరుడి సదా నందంతో కలిసి అన్నాసాగరానికి బయలు దేరారు. సదానందం బైక్‌ నడుపుతుండగా కొ మురయ్య వెనుక కూర్చున్నాడు. గ్రామంలోని బీసీ కాలనీకి చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న బైక్‌.. వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కొమురయ్యకు తీవ్రగా యాలయ్యాయి. వెంటనే వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.

ఆది, సోమవారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన ఇద్దరు, కాటారం మండలం మేడిపల్లిలో ఒకరు, హసన్‌పర్తి మండలం అన్నాసాగరం వద్ద మరొకరు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
1/2

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
2/2

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement