రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Published Fri, May 24 2024 10:20 AM

-

ఆళ్లగడ్డ: పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్‌ (25) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కారు డ్రైవర్‌గా ఉన్నాడు. బుధవారం అర్ధరాత్రి పట్టణ శివారులోని ఓ హోటల్‌లో భోజనం చేసి తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో మహాలక్ష్మి ఫంక్షన్‌ హాలు సమీపంలో అదుపుతప్పి రోడ్డు డివైర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్‌కుమార్‌ను స్థానిక వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement