Sakshi News home page

ప్రసవాల్లో ప్రథమం

Published Thu, Mar 28 2024 1:25 AM

ప్రభుత్వాసుపత్రిలో బాలింతల వార్డు 
 - Sakshi

● ఏరియా అసుపత్రిలో రికార్డుస్థాయి కాన్పులు ● 6 సంవత్సరాలుగా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

ఎమ్మిగనూరురూరల్‌: ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ఆదర్శ కాన్పుల వార్డు’ అత్యుత్తమ ఫలితాలనిస్తోంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలతోపాటు సి.బెళగల్‌, ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల్లోని మెజార్టీ గ్రా మాల ప్రజలకు ఎమ్మిగనూరు వైద్యశాలలో విస్తృత వైద్యసేవలు అందుతున్నాయి. ప్రారంభంలో 30 ప డకల ఆసుపత్రి 2002లో కమ్యూనిటీ ఆసుపత్రిగా నూతనంగా నిర్మించి పడకల సంఖ్య పెంచారు. నేడు రూ.12.60 కోట్లతో 100 పడకలకు అప్‌గ్రేడ్‌చేశారు. రూ.కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రి గత ఆరు సంవత్సరాలుగా ప్రసవాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది.

రూ.2కోట్లతో ‘ఆదర్శ’కాన్పుల వార్డు

యూనెసెఫ్‌ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మిగనూరు వైద్యశాలలో ఆదర్శ కాన్పుల వార్డును ఏర్పాటు చేసింది. రూ.2 కోట్లతో కార్పొరేట్‌ స్థాయిలో వార్డులో సౌకర్యాలు కల్పించారు. నలుగురు గైనకాలజిస్టులు, 25 మంది స్టాఫ్‌ నర్సులను నియమించారు. ఇక్కడ నెలకు 220 నుంచి 310కి పైగా కాన్పులు చేస్తున్నారు. ప్రతిరోజూ గర్భిణిలకు స్కానింగ్‌, రక్తపరీక్షలు, సాధారణ చెకప్‌లు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వచ్చినా ఇక్కడ సేవలు అందుతున్నాయి.

గర్భవతులకు ఆర్థిక సాయం

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకునే వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. పీహెచ్‌సీలో 3 నెలల తరువాత పేరు నమోదు చేసుకుంటే 5వ నెలలో రూ. 2 వేలు, ఆసుపత్రిలో ప్రసవం జరిగితే రూ.1000, సంవత్సరన్నరలో అన్ని వ్యాక్సిన్స్‌ వేయించుకుంటే రూ. 2 వేలు నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తారు. ఆరోగ్యశ్రీ ఆసరా కింద రూ. 4 వేలు, జననీ సురక్ష యోజన కింద రూ.1000 బాలింతకు ఇస్తున్నారు.

సంవత్సరం నార్మల్‌ డెలివరీ ీసీజేరియన్‌ మొత్తం

2019 2,123 318 2,441

2020 2,507 420 2,927

2021 2,612 592 3,204

2022 2,642 521 3,164

2023 571 114 685

2024 2,583 567 3,150

ఎమ్మిగనూరు ఆసుపత్రిలో ప్రసవాలు సంవత్సరాల వారీగా..

ప్రసవాల సంఖ్య పెరుగుతోంది

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. నార్మల్‌ డెలివరీలతో పాటు అత్యవసరమైతే సిజేరియన్‌లు చేస్తున్నాం. ప్రతి నెలా స్కానింగ్‌ పరీక్షలకు గర్భవతులు వందల సంఖ్యలో వస్తున్నారు. నెలకు వందకు పైగా కుటుంబ నియంత్ర ఆపరేషన్లు కూడా చేస్తున్నాం. 100 పడకల ఆసుపత్రి పూర్తయితే మెరుగైన సేవలు అందిందచే అవకాశం ఉంది. డాక్టర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

– డాక్టర్‌ మైత్రేయి, గైనకాలజిస్ట్‌, సూపరిండెంట్‌

నెలనెలా వైద్య పరీక్షలు తప్పనిసరి

గర్భవతులు క్రమం తప్పకుండా నెల నెల వైద్య పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలి. ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందితున్నాయి. గర్భవతులు స్కానింగ్‌తో పాటు వైద్య పరీక్షలు చేయించుకొని, మంచి పౌష్టికాహరం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

– డాక్టర్‌ సుజిత, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం సురక్షితం

ఇంట్లో కాకుండా ప్రభుత్వా సుపత్రిలో ప్రసవాలు జరిగితే తల్లీబిడ్డలకు మంచిది. ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకొని అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవాల కోసం ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. గర్భవతులు ప్రభుత్వాసుపత్రిలోని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ ఫాతిమా, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌

Advertisement

What’s your opinion

Advertisement