కృష్ణాలో పారిశ్రామిక విప్లవం | Sakshi
Sakshi News home page

కృష్ణాలో పారిశ్రామిక విప్లవం

Published Sun, May 12 2024 8:50 AM

కృష్ణాలో పారిశ్రామిక విప్లవం

సాక్షి, మచిలీపట్నం: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి. ఇందుకు పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పాలి. ప్రధాన జీవనాధారం వ్యవసాయమే అయినా రోజురోజుకు సమాజంలో వస్తున్న మార్పు కారణంగా ఏదైనా కొలువులో స్థిరపడాలనేది నేటి తరం యువత కల. అది ప్రభుత్వ ఉద్యోగమైనా.. ప్రైవేటుది అయినా సరే. అయితే అత్యధికంగా పోటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగం కంటే పారిశ్రామిక రంగంలో రాణించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. స్మాల్‌ స్కేల్‌, మైక్రో తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఐదేళ్లలో జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు తీసింది. ప్రభుత్వం అందించే సహాయంతో ముందుకు వచ్చిన ఔత్సాహికులు తమ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. చిన్న తరహా పరిశ్రమలే అయినా తమతో పాటు మరి కొందరికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆసరాగా ఉంటున్నారు. ఫలితంగా జిల్లాలో వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.

గుడివాడలో అత్యధికంగా...

జిల్లాలోని 25 మండలాల్లోనూ చిన్న పరిశ్రమలు కొత్తగా స్థాపించారు. నాలుగున్నరేళ్లలో ఒక్కో మండలంలో కనీసం 40కి పైగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయి. ఇందులో అత్యధికంగా గుడివాడ మండలంలో రూ.74.59 కోట్లతో 776 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేయగా 2,071 మందికి ఉపాధి అవకాశాలు వరించాయి. అయితే మచిలీపట్నంలో రూ.93.36 కోట్లతో ఏర్పాటు చేసిన 681 ఎంఎస్‌ఎంఈల ద్వారా అత్యధికంగా 3,071 మందికి ఉపాధి లభించడం గమనార్హం.

సింగిల్‌ డెస్క్‌ విధానంతో వేగంగా ప్రక్రియ

పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అందుకు ఐదారు శాఖల అనుమతులు అవసరం. ముఖ్యంగా పరిశ్రమల శాఖతో పాటు లేబర్‌, స్థానిక సంస్థలు, విద్యుత్‌, జీఎస్‌టీ లాంటి అనుమతులను జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు ఆయా శాఖల అధికారులతో సంప్రదించి అనుమతులు ఇప్పించేందుకు అన్ని విధాలా సహకరిస్తారు. దీంతో ఔత్సాహికుడు అన్ని శాఖలకు తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించి రాయితీ విడుదలపై చర్చిస్తున్నారు.

నాలుగున్నరేళ్లలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈల వివరాలు:

మండలం ఏర్పడిన ఉపాధి పెట్టుబడి

ఎంఎస్‌ఎంఈల సంఖ్య పొందిన వారు (రూ. లక్షల్లో)

అవనిగడ్డ 95 338 1278

బంటుమిల్లి 110 313 1429.45

బాపులపాడు 199 2968 7682.61

చల్లపల్లి 203 568 2256

గన్నవరం 370 1934 7302.8

ఘంటసాల 44 104 5359

గుడివాడ 776 2071 7459.29

గుడ్లవల్లేరు 437 739 2496.7

గూడూరు 275 894 2906

కంకిపాడు 121 372 1394

కోడూరు 98 323 1771.5

కృత్తివెన్ను 202 268 1028.5

మచిలీపట్నం 681 3071 9336.02

మోపిదేవి 57 165 417.9

మొవ్వ 102 291 826.8

నాగాయలంక 150 310 1435.5

నందివాడ 187 304 1435.3

పామర్రు 145 626 1491.807

పమిడిముక్కల 88 237 892

పెడన 152 382 1227.96

పెదపారుపూడి 88 215 553.813

పెనమలూరు 463 2116 7666.06

తోట్లవల్లూరు 140 351 1372

ఉంగుటూరు 79 143 478.5

ఉయ్యూరు 218 668 1700.49

వైఎస్సార్‌ తాడిగడప 99 164 1075

మొత్తం 5,579 19,935 722,73 కోట్లు

చిన్న తరహా పరిశ్రమలకు ఊతం

ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యం

సర్కారు సాయంతో ముందుకు వచ్చిన ఔత్సాహికులు

కృష్ణాజిల్లాలో నాలుగున్నరేళ్లలో

5,579 పరిశ్రమల ఏర్పాటు

రూ.722.73 కోట్ల పెట్టుబడులు

19,935 మందికి ఉద్యోగ అవకాశాలు

నాలుగేళ్లలో రూ.772 కోట్లతో 5,579 ఎంఎస్‌ఎంఈలు

కృష్ణాజిల్లాలో సహజ వనరులు పుష్కలంగా ఉండడంతో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలు దక్కింది. ప్రభుత్వ సహకారంతో ఔత్సాహికులు తమ ఆలోచన, అభిరుచులకు తగ్గట్లు రూ.772.73కోట్లతో 5,579 ఎంఎస్‌ఎంఈలు (మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) ఏర్పాటు చేసుకున్నారు. దీని వల్ల 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. మరోవైపు గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో నాలుగు లార్జ్‌, అండ్‌ మీడియం పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.6 కోట్లు పెట్టుబడి పెట్టగా వీటి ద్వారా 2,300 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి.

రాయితీలతో చేయూత

చిన్న, మైక్రో పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలతో ప్రభుత్వం అండగా ఉంటోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఔత్సాహికులకు ఉత్పత్తి పరిశ్రమ అయితే రూ.50 లక్షల వరకు రుణం, సర్వీసింగ్‌ సెక్టారులో రూ.20లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న బడుగు వికాసం కింద ఉత్పత్తి సంస్థలకు రూ.1.20 కోట్ల వరకు సబ్సిడీ కల్పిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement