క్రిమినల్‌ కేసులు | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ కేసులు

Published Sat, May 25 2024 12:30 AM

క్రిమినల్‌ కేసులు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే

ఆసిఫాబాద్‌: జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎస్పీ సురేశ్‌కుమార్‌, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ శాఖ అధికారి కృష్ణారెడ్డితో కలి సి శుక్రవారం ఫర్టిలైజర్‌ వ్యాపారులు, వ్యవసా య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన పురుగు మందులు అమ్మితే సహించేది లేదని, అలాంటి వ్యా పారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీ షాపు ముందు ఎరువులు, విత్తనాల ధరల పట్టిక వివరాలు ఉంచాలని, డీలర్‌ షాప్‌ లైసెన్సు వివరాలు ప్రదర్శించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలు అరికట్టేందుకు వ్యవసాయ శాఖ విత్తన కార్పొరేషన్‌ చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు విధిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల రవాణా అరికట్టేందుకు వ్యవసాయ, విత్తన కార్పొరేషన్‌, పోలీ సు బలగాలతో జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందా లు ఏర్పాటు చేశామని తెలిపారు. లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేసినా.. దుకాణాల్లో ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో ఎవరైనా నకిలీ విత్తనా లు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ విత్తనాలతో నష్టపోతే డీల ర్లు, కంపెనీ యజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులు విత్తనాల ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని, ఒకవేళ నష్టపోతే ఆయా కంపెనీల నుంచి పరిహారం పొందేందుకు అవకా శం ఉంటుందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శా ఖ, పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సమన్వ యం చేసుకుని నకిలీ వ్తితనాల రవాణా అరికట్టా లని ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో దుకాణాల్లో తనిఖీలు చేపడతామన్నారు.

కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

అధికారులు, వ్యాపారులతో సమీక్షా సమావేశం

Advertisement
 
Advertisement
 
Advertisement