విజ్ఞతతో ఓటు వేశారు | Sakshi
Sakshi News home page

విజ్ఞతతో ఓటు వేశారు

Published Wed, May 15 2024 12:35 AM

విజ్ఞతతో ఓటు వేశారు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులని, వారు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేశారని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్‌ఎస్‌కే పడిందని, తాను మంచి మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ గ్రామం వెళ్లినా కుల, మతాలకతీతంగా తనను ఆశీర్వదించి, మద్దతుగా నిలిచారని చెప్పారు. కేసీఆర్‌ రోడ్డు షో సందర్భంగా కూడా భారీగా ప్రజలు తరలివచ్చారని చెప్పారు. ఆరు నెలల కాలంలో తాగు, సాగు నీరు, కరెంట్‌ కోతల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఏది ఏమైనా తమకు అనుకూలంగా మంచి ఫలితాలు వస్తాయనే గట్టి నమ్మకం ఉందని చెప్పారు. తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సీనియర్‌ నాయకులు, జిల్లా, మండల, గ్రామ, బూత్‌ స్థాయి నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు, తెలియజేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ, కూరాకుల నాగభూషణం, బిచ్చాల తిరుమల్‌రావు, ఆర్జేసీ కృష్ణ, బెల్లం వేణుగోపాల్‌, తాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement