మోహన్‌లాల్‌ను కలిసిన రిషబ్‌శెట్టి | Sakshi
Sakshi News home page

మోహన్‌లాల్‌ను కలిసిన రిషబ్‌శెట్టి

Published Fri, Apr 19 2024 1:40 AM

మోహన్‌లాల్‌తో రిషబ్‌ శెట్టి 
 - Sakshi

యశవంతపుర: శాండిల్‌వుడ్‌ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి మలయాళం నటుడు మోహన్‌లాల్‌ను కలిశారు. కాంతార సీక్వెల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న రిషబ్‌శెట్టి మోహన్‌లాల్‌ను కలిసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు అప్‌లోడ్‌ చేశారు. మళయాళం అగ్ర నటుడిని కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రిషబ్‌శెట్టి పేర్కొన్నారు.

లారీ ప్రమాదంతో

సాంకేతిక సమస్య

రైళ్ల రాకపోకలకు అంతరాయం

శివమొగ్గ: శివమొగ్గ జిల్లా భద్రావతి పట్టణంలోని రైల్వే అండర్‌ పాస్‌ పైభాగంలో బారికేడ్లను గురువారం తెల్లవారుజామున లారీ ఢీకొంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలపై పడిన ఇనుప బారికేడ్లను తొలగించి పట్టాలను పరిశీలించి మూడు గంటల తరువాత రైళ్లకు అనుమతి ఇచ్చారు. దీంతో తెల్లవారుజామున 4.45 గంటలకు చేరుకోవాల్సిన మైసూరు తాళ్లగుప్ప ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉదయం 6.45కు శివమొగ్గ చేరుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు.

కుమార్తెను కలవొచ్చు

శాశ్వతంగా అప్పగించడం సాధ్యం కాదు

ఓ వ్యక్తి పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

బనశంకరి: ఆర్థిక సామర్థ్యం ఉన్నంత మాత్రాన మైనర్‌ కుమార్తెను తండ్రికి అప్పగించడం ఆధారం కాదని గురువారం హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కారణంతో 14 ఏళ్ల కుమార్తెను శాశ్వతంగా తనకు అప్పగించాలని భార్యకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి కోర్టులో వేసిన అప్పీల్‌ను తిరస్కరించింది. బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో వేసిన అప్పీల్‌ కేసును గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు అనుశివరామన్‌, అనంతరామనాథహెగ్డేతో కూడిన పీఠం ఈ ఆదేశాలు జారీ చేసింది. కానీ కుమార్తెను కలవడం, ఉత్తమ విద్యకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లవచ్చునని తెలిపింది.

మద్యం అమ్మకాలపై నిషేధం

యశవంతపుర: లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బెంగళూరులో రెండు రోజుల పాటు ఈ నెల 24, 26న మద్యం అమ్మకాలను నిషేధిస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. 24న సాయంత్రం 6 గంటల నుంచి 26వ తేదీ అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను నిషేధించటంతో పాటు 144 సెక్షన్‌ను విధించారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement