రైతులకు పరిహారం అందించండి | Sakshi
Sakshi News home page

రైతులకు పరిహారం అందించండి

Published Thu, Nov 16 2023 12:32 AM

మందగతిన సాగుతున్న పనులు - Sakshi

తుమకూరు: కరువుతో జిల్లాలోని పది తాలూకాల్లో సుమారు రూ.2,500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తక్షణమే పరిహారాన్ని అందించాలని ఎమ్మెల్సీ తిప్పేస్వామి డిమాండ్‌ చేశారు. జిల్లాధికారికి జేడీఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన నివేదికను అందించి ఆయన మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

ఎయిర్‌పోర్టు ప్రత్యామ్నాయ మార్గం బంద్‌ చేస్తాం

దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం (కెంపేగౌడ ఎయిర్‌పోర్టు–బూదిగెరె–బూదిగెరె క్రాస్‌)ఓల్డ్‌ మద్రాస్‌ రోడ్డు అభివృద్ధి పనులు ఆరేళ్లుగా మందగతిన సాగుతున్నాయని, దీనికి నిరసనగా రోడ్డు మూసివేస్తామని స్థానికులు ప్రకటించారు. రోడ్డు పనులు నాసిరకంగా చేయడంతో పాటు ఏళ్ల తరబడి చేస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. బుధవారం సాంకేతికంగా ధర్నా చేపట్టిన స్థానిక ప్రజలు పనులు త్వరగా పూర్తిచేయకుంటే శాశ్వతంగా రోడ్డు మూసివేస్తామని హెచ్చరించారు.

కుమారస్వామికి

వ్యతిరేకంగా పోస్టర్లు

దొడ్డబళ్లాపురం: జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామికి వ్యతిరేకంగా మంగళవారం రాత్రి బెంగళూరులోని జేడీఎస్‌ కార్యాలయం గోడలపై పోస్టర్లు వెలిశాయి. దీపావళి సందర్భంగా తన ఇంటికి విద్యుత్‌ దీపాలంకరణ చేయించిన కుమారస్వామి వాటికి ఇంటి ముందు ఉన్న విద్యుత్‌ స్తంభం నుంచి అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అయితే ఇది తన తప్పిదం కాదని, అయినా తప్పు జరిగిందని, అందుకు బాధ్యత వహిస్తానని కుమారస్వామి ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ కుమారస్వామికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. 200 యూనిట్లు మాత్రమే ఉచితం అని గుర్తు పెట్టుకోవాలని, ఎక్కువ చోరీ చేయవద్దని, కరెంటు దొంగ కుమారస్వామి అంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు.

గిరిజన సామాజికవర్గం పాత్ర అమోఘం

మైసూరు: జాతీయ గౌరవాన్ని సంరక్షించడంలో గిరిజన సామాజికవర్గం పాత్ర అపారమైనదని గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ కొనియాడారు. బుధవారం మైసూరులోని కీర్గళ్లిలో రాష్ట్ర గిరిజన పరిశోధన సంస్థలో కేంద్ర గిరిజన వ్యవహారాల సచివాలయం, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ, కర్ణాటక రాష్ట్ర గిరిజన పరిశోధన సంస్థ, జిల్లా పంచాయతీ సహభాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బిర్సాముండ జయంతి జనజాతి గౌరవ దివస్‌–2023 కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

న్యూస్‌రీల్‌

Advertisement
Advertisement