29న అథ్లెటిక్స్‌ ఎంపికలు | Sakshi
Sakshi News home page

29న అథ్లెటిక్స్‌ ఎంపికలు

Published Thu, May 23 2024 4:25 AM

-

కామారెడ్డి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈనెల 29న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ పురుషులు, మహిళలతోపాటు అండర్‌–8, 10, 12, 14, 16, 18, 20 విభాగాలలో బాలబాలికలకు 50, 80, 100, 400, 800 మీటర్ల పరుగు, డిస్కస్‌, జావెలిన్‌ త్రో అంశాలలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో జిరాక్స్‌, లేదా పుట్టిన తేదీ సర్టిఫికెట్‌తో ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement