పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Published Tue, May 21 2024 9:00 AM

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి క్రైం: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. 24 నుంచి జూన్‌ 3 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షల అధికారులు వెంటనే ఆయా పరీక్ష కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్‌, వి ద్యుత్‌, తాగునీరు, వెలుతురు లాంటి మౌలిక సదుపాయాలను పరిశీలించాలన్నారు. ఏవైనా లోటుపా ట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించా రు. మాల్‌ ప్రాక్టీస్‌, మాస్‌ కాపీయింగ్‌లను అనుమతించవద్దన్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క ని మిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించవద్దన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. సమావేశంలో ఇంటర్‌ బోర్డు నోడల్‌ అధి కారి షేక్‌ సలాం, పరీక్షల విభాగం అధికారులు శ్రీ నాథ్‌, నాగేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement