రైతు రుణ పరిమితులు ప్రతిపాదించండి | Sakshi
Sakshi News home page

రైతు రుణ పరిమితులు ప్రతిపాదించండి

Published Wed, Nov 22 2023 11:50 PM

-

కలెక్టర్‌ కృతికా శుక్లా

డీఎల్‌టీసీ సమావేశంలో

అధికారులకు ఆదేశం

22కెకెడి102:

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృతికా శుక్లా

కాకినాడ సిటీ: పెట్టుబడి, ఉత్పాదక వ్యయం, ధరల పెరుగుదల వంటి అంశాల ఆధారంగా 2024–25 సంవత్సరానికి వివిధ వ్యవసాయ, అనుబంధ రంగాల రైతులకు అందించే రుణ పరిమితులను ప్రతిపాదించాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో డీసీసీబీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెక్నికల్‌ కమిటీ (డీఎల్‌టీసీ–2024–25) సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పాడి, మత్స్య కార్యకలాపాలు చేపట్టే రైతులకు ఉత్పాదక వ్యయం, రాబడుల ఆధారంగా బ్యాంకుల ద్వారా అందించగల రుణ పరిమితులను ఆయా శాఖల జిల్లా అధికారులు కమిటీకి వివరించారు. ఉత్పాదక వ్యయంలో కనీసం 60 శాతం పంట కాలిక రుణాలుగా అందించేందుకు ఆయా అంశాల కింద రుణ పరిమితులను కమిటీ నిర్ణయించింది. ఎకరాకు ప్రధాన పంట వరికి రూ.38 వేలు నుంచి రూ.45 వేలు, మొక్కజొన్నకు రూ.28 వేల రూ.42 వేలు, మిరపకు రూ.68 నుంచి రూ.75 వేలు, ప్రత్తికి రూ.40 నుంచి రూ.60 వేలు, అరటి రూ.75 వేలు నుంచి రూ.85 వేలు, మామిడికి రూ.40 నుంచి రూ.45 వేలు, ఆయిల్‌ పామ్‌కు రూ.65 వేలు, కూరగాయల పంటలకు రూ.16 నుంచి రూ.40 వేలు, ఉల్లికి రూ.45 వేల నుంచి రూ.51 వేలుగా నిర్ణయించింది. అలాగే మల్బరీ, పట్టుగూళ్లకు రూ.85 వేల నుంచి రూ.95 వేలు, రొయ్యల సాగుకు రూ.5 లక్షల నుంచి రూ.5.50 లక్షలుగా నిర్ణయించిందన్నారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర కమిటీ ఆమోదానికి పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement