Sakshi News home page

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు

Published Sun, Mar 24 2024 1:20 AM

ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను పరిశీలిస్తున్న 
అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహన్‌   - Sakshi

అయిజ: వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహన్‌ అన్నారు. శనివారం మండలంలోని భూంపురంను ఆయన సందర్శించారు. ఓవర్‌ హెడ్‌ట్యాంక్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఎంపీఓ నరసింహారెడ్డితో మాట్లాడారు. ఏప్రిల్‌లో మిషన్‌ భగీరథ నీరు నిలిచిపోయే అవకాశం ఉందని, దీంతో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పర్యటించి ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఎక్కువగా ఉందో గమనించాలని అన్నారు. గతంలో నిర్మించిన బోరుబావుల్లో పూడిక తీయించాలని, మోటార్లకు మరమ్మతు చేయించాలని అన్నారు. ఎండలు ముదిరేకొద్ది తాగునీటి అవసరం ఎక్కువవుతుందని, నీటి వనరులు లేని గ్రామాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని పలు సలహాలు చేశారు. గ్రామ కార్యదర్శి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement