Sakshi News home page

నేటి నుంచి వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి జాతర

Published Mon, Mar 25 2024 1:55 AM

పూజలు నిర్వహిస్తున్న 
అర్చకుడు (ఫైల్‌) - Sakshi

దేవరుప్పుల: మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధి పొట్టిగుట్ట వద్ద ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. హోలీ పర్వదినం పురస్కరించుకొని దేవతమూర్తుల బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఉగాది వరకు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. కడవెండి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలీలు ఎడ్లబండిపై మగ్గం ఏర్పరచి నూతన వస్త్రాలను భజన మండలి, కోలాటం చప్పుళ్ల మధ్య గుట్టపైకి వెళ్లి కల్యాణోత్సవం జరిపించడం విశేషం. ఈ కల్యాణోత్సవానికి నేడు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హాజరుకానున్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన వానకొండయ్య లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర అభివృద్ధికి పాలకులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement